iOS 11లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?
కొద్ది రోజుల క్రితం యాపిల్ తన లేటెస్ట్ iOS 11 వర్షన్‌ను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి కొన్ని ఐఫోన్, ఐప్యాడ్ మోడల్స్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తోన్న ఈ సాఫ్ట్‌వేర్ వర్షన్‌లో కంట్రోల్ సెంటర్, యాపిల్ పే వంటి విప్లవాత్మక ఫీచర్లు ఉన్నాయి. iOS 11 ఆపరేటింగ్ సిస్టంలోని పాజిటివ్, నెగిటివ్ అంశాలను ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా పాజిటివ్ పాయింట్స్..

సిరి (Siri)
iOS 11 హైలైట్ ఫీచర్లలో యాపిల్ సిరి ఒకటి. ఈ పర్సనల్ వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ ద్వారా పదబంధాలను కావల్సిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే వీలుంటుంది. ఈ వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ మాట్లాడటమే కాదు ట్రాన్స్‌లేట్ చేసిన కంటెంట్‌ను ఫోన్ డిస్‌ప్లే పై కూడా చూపిస్తుంది.

లైవ్ ఫోటోస్ (Live Photos)
iOS 11 హైలైట్ ఫీచర్లలో లైవ్ ఫోటోస్ కూడా ఒకటి. ఈ ఫీచర్ ద్వారా లైవ్ ఫోటోలకు బౌన్స్, లూప్ వంటి ఎఫెక్ట్‌లను అద్ది నచ్చిన విధంగా ఎడిట్ చేసుకునే వీలుటుంది. ఫోటోను ఎడిట్ చేసిన తరువాత మొత్తం ఫలితాన్ని చూసుకునేందుకు ప్రివ్యూ విండో కూడా అందుబాటులో ఉంటుంది.

యాప్ స్టోర్ (App store)
iOS 11 సాఫ్ట్‌వేర్ వర్షన్‌లో భాగంగా యాపిల్ తన అప్లికేషన్ స్టోర్‌ను పూర్తిగా అప్‌డేట్ చేసింది. దీంతో యూజర్లు యాప్ స్టోర్‌ను మరింత సులువుగా మేనేజ్ చేసుకునే వీలుంటుంది. యాప్ స్టోర్‌లో ఏర్పాటు చేసిన Today tab ద్వారా ట్రెండింగ్ యాప్స్ ఇంకా గేమ్స్ వివరాలను తెలుసుకునే వీలుంటుంది.

స్ర్కీన్‌షాట్స్ (Screenshots)
iOS 11 సాఫ్ట్‌వేర్ వర్షన్‌లో స్ర్కీన్‌షాట్స్ వ్యవస్థను యాపిల్ మరింతగా మెరుగుపరిచింది. iOS 11 యూజర్లు ఇప్పుడు స్ర్కీన్‌షాట్‌లను క్యాప్చుర్ చేసిన వెంటనే ఆ ఇమేజ్ పై టెక్స్ట్ ఇంకా డ్రాయింగ్స్‌ను మార్కప్ చేసుకునే అవకాశాన్ని యాపిల్ కల్పిస్తోంది.
ఇవే కాకుండా బ్యాటరీ తక్కువుగా ఉన్న సమయంలో అన్‌యూజుడ్ యాప్స్‌ను ఆటోమెటిక్‌గా ఆఫ్‌లోడ్ చేయటం, డాక్యుమెంట్స్ ఇంకా డేటాను సంరక్షించటం, రీడిజైన్ చేయబడిన కంట్రోల్ సెంటర్ తదితర పాజిటివ్ అంశాలు iOS 11 వర్షన్‌లో ఉన్నాయి.

నెగిటివ్ పాయింట్స్ విషయానికి వచ్చేసరికి..
ఆకట్టుకోని నోటిఫికేషన్ వ్యవస్థ:
iOS 11 వర్షన్‌లో నోటిఫికేషన్ వ్యవస్థ కన్ఫ్యూజన్‌గా ఉంది. ముఖ్యంగా ఫోన్ లాక్ స్ర్ర్కీన్ పై కనిపిస్తోన్న నోటిఫికేషన్స్ గందరగోళానికి గురి చేస్తున్నాయి. స్ర్కీన్ పై ఉన్న నోటిఫికేషన్‌లను వ్యూ లేదా క్లియర్ చేసేందుకు ఫోన్ స్ర్కీన్ పై leftward swipe చేస్తుంటే కెమెరా యాప్ ఓపెన్ అయిపోతోంది.

న్యూస్ అండ్ మ్యూజిక్ (News and Music)
iOS 11 వర్షన్‌లోని న్యూస్ అండ్ మ్యూజిక్ యాప్‌ను యాపిల్ అంతగా అప్‌డేట్ చేసినట్లు అనిపించటం లేదు. ఈ యాప్‌లో కొత్తగా యాడ్ అయిన స్పాట్‌లైట్ ట్యాబ్ ఫీచర్ ద్వారా సెలక్ట్ చేయబడిన కంటెంట్‌ను ఎడిట్ చేసుకునే వీల కల్పించారు.
ఈ యాప్‌లో బాగంగా యూజర్ తన యాపిల్ మ్యూజిక్‌కు సంబంధించి ప్రొపైల్‌ను సెటప్ చేసుకుని ప్లే లిస్ట్‌లను షేర్ చేయటంతో పాటు ఫేవరెట్ ఆల్బమ్స్ ఇంకా స్టేషన్‌లను హైలైట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్స్ ఐపోన్ యూజర్లను అంతగా ఆకట్టుకోలేక పోవచ్చు.

గ్రూప్ ఫేస్‌టైమ్ సదుపాయం లేదు (No group Facetime)
iOS 11 సాఫ్ట్‌వేర్ వర్షన్‌లో భాగంగా యాపిల్ తన ఫేస్‌టైమ్ ఫీచర్‌ను పరిచయం చేసినప్పటికి ఈ ఫీచర్ గ్రూప్ కాలింగ్‌ను సపోర్ట్ చేయటం లేదు. కేవలం ఇద్దిరు మాత్రమే ఫేస్‌టైమ్ కాల్స్ చేసుకోగలరు.

iOS 11 సాఫ్ట్‌వేర్ వర్షన్‌ను సపోర్ట్ చేసే డివైసుల వివరాలు..
ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 5ఎస్, 2017 ఐప్యాడ్ ప్రో (12.9 ఇంచ్) వేరియంట్, 2017 ఐప్యాడ్ ప్రో (10.5 ఇంచ్) వేరియంట్, 2017 ఐప్యాడ్ ప్రో (9.7 ఇంచ్) వేరియంట్, ఐప్యాడ్ మినీ 4, ఐప్యామ్ మినీ 3, ఐప్యామ్ మినీ 2, ఐప్యాడ్ ఎయిర్ 2, ఐప్యాడ్ ఎయిర్, ఐపోడ్ టచ్ (6th జనరేషన్).


Click it and Unblock the Notifications