OPPO నుంచి మరో సంచలన కెమెరా ఫోన్

ఈ ప్రపంచం మీద స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో సెల్ఫీ ఫోటోను తీసుకునే ఉంటారు. తమ స్పెషల్ మూమెంట్స్‌ను సెల్ఫీలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయటం అనేది, నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఓ భాగంగా మారిపోయింది.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని శాసిస్తోన్న ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విప్లవాత్మక మార్పులు..

సెల్ఫీ సంస్కృతి ఇంతలా అభివృద్ధి చెందటానికి ప్రధానమైన కారణం, స్మార్ట్‌ఫోన్‌ ముందు భాగంలో అమర్చుతున్న శక్తివంతమైన ఫ్రంట్ కెమెరాలు. గతంతో పోల్చి చూస్తే స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ కెమెరా టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో అమర్చే రేర్ కెమెరాలతో ఫ్రంట్ కెమెరాలు పోటీ పడగలుగుతున్నాయి.

'Selfie Expert'

సెల్ఫీ సెంట్రిక్ ఫోన్‌ల తయారీ విభాగంలో అగ్రగామి బ్రాండ్‌గా దూసుకుపోతున్న OPPO మరో శక్తివంతమైన 'Selfie Expert' ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. F3 Plus పేరుతో రాబోతున్న ఈ విప్లవాత్మక ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ కెమెరాలో ఒక వైడ్ యాంగిల్ లెన్స్ అలానే ఒక స్డాండర్డ్ లెన్స్ మాడ్యుల్స్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ వినూత్న కాంభినేషన్‌తో సెల్ఫీ ఫోటోగ్రఫీ తరువాతి లెవల్ కు వెళ్లటం ఖాయం.

భిన్నమైన కాంభినేషన్‌లో...

OPPO ఇప్పటివరకు అందుబాటులోకి తీసుకువచ్చిన సెల్ఫీ సెంట్రిక్ ఫోన్‌లలో స్డాండర్డ్ లెన్స్ పనితీరును మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే, ఒప్పో లేటెస్ట్ ఫోన్ ఫ్రంట్ కెమెరాలో స్డాండర్డ్ లెన్స్‌తో పాటు వైడ్ యాంగిల్ లెన్స్ మాడ్యుల్‌ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. భిన్నమైన కాంభినేషన్‌లో రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేకమైన కెమెరా సెన్సార్, గ్రూప్ సెల్ఫీలకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. స్నాప్‌సెల్ఫీ అలానే గ్రూప్ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకునే సమయంలో యూజర్ తన అవసరాన్ని బట్టి ఈ రెండు మాడ్యుల్స్ మధ్య సెకన్ల వ్యవధిలో మారిపోవచ్చు. దీని కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ బటన్‌ను కూడా కెమెరా షట్టర్ ప్రక్కన ఒప్పో ఏర్పాటు చేసింది.

అంతరాయంలేని సెల్ఫీల కోసం బ్యూటీ మోడ్ 4.0

ఒప్పో తన అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ కెమెరాలో బ్యూటీఫై 4.0 మోడ్‌ను ఎక్విప్ చేసింది. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకునే సమయంలో స్పష్టమైన ముఖ ఆకృతులను తీసుకురావటం, టోన్స్, షాడోస్ అలానే లైట్‌ను అడ్జస్ చేసుకునే వీలుంటుంది. వందల కొలది దృశ్యవివరణలతో పాటు మల్టిపుల్ బ్యూటిఫై లెవల్స్‌ను ఒప్పో ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లో అందుబాటులో ఉంచింది. వీటి సహాయంతో యూజర్ చిత్రీకరించుకునే సెల్ఫీ షాట్స్ సహజసిద్ధమైన రంగలుతో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్చుర్‌‌గా నిలుస్తాయి.

పర్‌ఫెక్ట్ గ్రూప్ సెల్ఫీల కోసం సెల్ఫీ పానోరమా

ఒప్పో అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా చిత్రీకరించుకునే గ్రూప్ సెల్ఫీల్లో ఏ ఒక్కరూ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇందుకు కారణంలో F3 Plus ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ కెమెరా రెండు విప్లవాత్మక టెక్నాలజీలు కలిసి పనిచేయటమే. ఈ ఫోన్ ద్వారా గ్రూప్ సెల్ఫీలను చిత్రీకరించుకునే సమయంలో వైడ్ యాంగిల్ లెన్స్ గ్రూప్ మొత్తం కవర్ అయ్యేలా అందరిని ఫ్రేమ్‌లోకి తీసుకుంటుంది. ఇదే సమయంలో ఫోన్ లోని 'Selfie Panorama' మోడ్ మూడు ఫోటోలను ఒక ఫోటోగా కలగలపి మంచి అవుట్ పుట్‌ను క్రియేట్ చేస్తుంది. గ్రూప్ సెల్ఫీలను చిత్రీకరించుకునే సమయంలో సెల్ఫీ పానోరమా మోడ్‌ను యాక్సిస్ చేసుకోవాలంటే స్కీన్ ఎడమ వైపు స్వైప్ చేయవల్సి ఉంటుంది. అంతా ఓకే అయిన తరువాత కెమెరా బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు కోరుకున్న గ్రూప్ సెల్ఫీ తీయబడుతుంది.

స్ర్కీన్ ఫ్లాష్

ఒప్పో ఎఫ్3 ప్లస్ కెమెరాలో స్ర్కీన్ ఫ్లాష్ ఫీచర్‌ను మరింతగా అప్‌డేట్ చేసారు. ఈ ఫీచర్ ద్వారా తక్కువ వెళుతురు కండీషన్‌లలోనూ హైక్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆటో మోడ్‌లో ఉంచుకోవటం ద్వారా లైటింగ్ లెవల్స్‌ను బట్టి స్ర్కీన్ ఫ్లాష్ అనేది అడ్జస్ట్ అయిపోతుంటుంది.

Palm Shutter

'Palm Shutter' పేరుతో సరికొత్త మోడ్‌‌ను ఒప్పో తన ఎఫ్3 ప్లస్ కెమెరాలో యాడ్ చేసింది. సెల్ఫీలను చిత్రీకరించుకునే సమయంలో ఈ మోడ్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే జస్ట్ కెమెరా ముందు చేయిను కదిలించటం ద్వారా ఆటోమెటిక్ సెల్ఫీ కౌంట్ డౌన్ మొదలైపోతుంది. తద్వారా ఫోటోల్లో ఏవిధమైన బ్లర్ అలానే షేక్స్ ఉండవు.

ఏ విధమైన థర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండవు..

ఒప్పో ఎఫ్3 ప్లస్ యూజర్లు క్రియేటివ్ ఫోటోగ్రఫీ కోసం ఏ విధమైన థర్డ్ పార్టీ యాప్‌లను తమ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సిన అవసరం ఉండుదు. ఎందుకంటే ఈ ఫోన్ కెమెరాలో ముందుగా అనే రకాల ఫిల్టర్స్ అలానే వాటర్ మార్కులను ఇన్‌బిల్ట్‌గా పొందుపరచటం జరిగింది. ఈ ఫిల్టర్స్ ఆధారంగా అనే క్రియేటివ్ ఫోటోలను యూజర్ క్యాప్చుర్ చేసుకోవచ్చు.

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌లో విప్లవాత్మక ఫ్రంట్ కెమెరా మాత్రమే కాదు బెస్ట్ క్వాలిటీ రేర్ కెమెరా కూడా ఉంది. ఫోన్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 16 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్ ద్వారా బెస్ట్ క్లాస్ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు. ఈ కెమెరాలో ఫోకసింగ్ స్పీడ్ ఆకట్టుకుంటుంది. తక్కువ వెళుతురు కండీషన్స్‌లోనూ ఈ కెమెరా పర్‌ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది.

Expert Mode, Ultra-HD, Super GIF

ఒప్పో ఎఫ్3 ప్లస్ కెమెరాలోని Expert Mode ద్వారా ఫోటోగ్రఫీలో కీలకంగా భావించే షట్టర్ స్పీడ్ అడ్జస్ట్‌మెంట్, ఫోకస్, వైట్ బ్యాలన్స్, ISO, లెవలింగ్ గేజ్ వంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కెమెరా యాప్‌లో జత చేసిన మరో మోడ్ Ultra-HD.ఈ మోడ్‌ను ఆన్‌చేయటం ద్వారా మీరు చిత్రీకరించే ఒక్కో ఫోటో నాలుగు సార్లు క్యాప్చుర్ కాబడుతుంది. వీటిలో బెస్ట్ పార్ట్స్‌ను కలుపుతూ 50 మెగా పిక్సల్ హై రిసల్యూషన్‌ ఇమేజ్ ఏర్పడుతుంది. మరో మోడ్ Double Exposure ద్వారా ప్రయోగాలు నిర్వహించుకోవచ్చు. Super GIF పేరుతో అందిస్తోన్న మరో మోడ్ ద్వారా ఇన్‌స్టెంట్‌గా GIF ఫైల్స్‌ను తయారు చేసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The camera technology inside the upcoming OPPO F3 Plus is a different game altogether. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot