45 ఏళ్లు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఫోన్,ఆసక్తికర నిజాలివే..

|

1973 ఏప్రిల్ 3న..అంటే సరిగ్గా ఇదే రోజు ప్రపంచపు తొలి మొబైల్ ఫోన్ బాహ్య ప్రపంచంలోకి దూసుకొచ్చింది. Motorola సంస్థ DynaTAC phoneని దాదాపు 45 ఏళ్ల కిందట మార్కెట్లోకి తీసుకొచ్చి ఓ సంచలనాన్ని నమోదు చేసింది. ఇది చాలా బరువుతో కూడుకున్న ఫోన్ కావడంతో దీన్ని బ్రిక్ ఫోన్ గా అభివర్ణించారు. ఇటుకరాయిలా కనిపించే ఈ ఫోన్ వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ ఫోనక ధర అప్పట్లోనే 2,60,000 రూపాయలు పలికింది. అయితే ఇది మార్కెట్లోకి రావడానికి దాదాపు 10 ఏళ్ల సమయం పట్టింది. ఎన్నో అవాంతరాల మధ్య సెప్టెంబర్, 1983న ఈ ఫోన్ కి FCC అప్రూవల్ లభించింది. ఈ ఫోన్.. 10 అంగుళాల పొడవు, 2 పౌండ్ల బరువుతో పైనాపిల్‌కి సమానంగా ఉండేది. నేటితో 45 సంవత్సరాలు నిండిన సందర్భంగా Motorola సంస్థ యానివర్శరీ సంబరాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా యూఎస్ లో ఉన్న యూజర్ల కోసం ఫెస్టివల్ సేల్ పేరిట ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఫోన్ వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకూ వైర్‌లెస్ పేజర్లు, ఫీచర్డ్ ఫోన్లు, సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లు, Android, iOS, Windows Mobile వంటి ఫోన్లు పరిణామ క్రమంలో మార్కెట్లో సంచలనాలు నమోదుచేశాయి.

 

గెలాక్సీ ఎస్‌8, గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గింపుగెలాక్సీ ఎస్‌8, గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గింపు

మొదటి వాణిజ్య సెల్‌ఫోన్:

మొదటి వాణిజ్య సెల్‌ఫోన్:

మార్కెట్లో విడుదలైన మొట్టమొదటి వాణిజ్య సెల్‌ఫోన్‌గా మోటరోలా డైనా టాక్ 8000 ఎక్స్ (Motorola DynaTAC 8000X)చరిత్రకెక్కింది. ఈ సెల్‌ఫోన్‌ను మోటరోలా సంస్థ 1984లో విడుదల చేసింది. మోటరోలా సంస్థకు చెందిన డాక్టర్ మార్టిన్ కూపర్ ఏప్రిల్ 4, 1973న మొదటి హ్యాండ్‌హెల్డ్ ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసారు.

మొదటి స్మార్ట్ ఫోన్:

మొదటి స్మార్ట్ ఫోన్:

1992లో ఐబీఎమ్ సంస్థ ‘ఐబీఎమ్ సైమన్' పేరుతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను కంప్యూటర్స్ డీలర్స్ ఎగ్జిబిషన్ వేదికగా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ హ్యండ్‌సెట్ 4.5 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి
కాలింగ్ వ్యవస్థతో పాటు క్యాలెండర్, అడ్రస్ బుక్, ఫ్యాక్స్, మోడెమ్, నోట్ ప్యాడ్, ఈమెయిల్ అప్లికేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.

మొట్టమొదటి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్:
 

మొట్టమొదటి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్:

1992లో మెక్‌గిల్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అలెన్ ఎంతేజ్, బిల్ హీలన్ ఇంకా జే. పీటర్‌లు ఆన్‌లైన్‌లో ప్రజలు నిర్దిష్ట ఫైళ్లను కనుగొనేందుకు వీలుగా ‘ఆర్చీ'(Archie) పేరుత ప్రత్యేకమైన టూల్‌ను వృద్ధి చేసారు. ఆర్చీ మొట్టమొదటి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్‌గా చరిత్రకెక్కింది.

మొట్టమొదటి సోషల్ మీడియా నెట్‌వర్క్ సైట్:

మొట్టమొదటి సోషల్ మీడియా నెట్‌వర్క్ సైట్:

1997లో సిక్స్ డిగ్రీస్ డాట్ కామ్ (SixDegrees.com) పేరుతో మొట్టమొదటి సోషల్ మీడియా నెట్‌వర్క్ సైట్‌ను ప్రారంభించారు. ఈ సైట్‌లో యూజర్లు తమ ప్రొఫైళ్లను క్రియేట్ చేసుకోవచ్చు.

జావా

జావా

ఇంటరాక్టివ్ టెలివిజన్ సాధ్యం చేయడానికి జేమ్స్ గోస్లింగ్, మైక్ షెర్డియన్ ఇంకా ప్యాట్రిక్ నాటన్‌ను జూన్ 1991లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పై పని చేయటం ప్రారంభించారు. వీరి కృషికి ఫలితంగా జావా ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది. 1995లో సన్ మైక్రోసిస్టమ్స్ సంస్థ జావా 1.0 ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అనేక అప్లికేషన్‌లను తయారు చేయటంలో జావా లాంగ్వేజ్ ఉపయోగపడుతోంది.

వరల్డ్ వైడ్ వెబ్:

వరల్డ్ వైడ్ వెబ్:

1992లో బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ ‘వరల్డ్ వెడ్ వెబ్' పేరుతో సరికొత్త సమాచార వ్యవస్థను నిర్మించారు.
ఇంటర్నెట్‌ను 1983, జనవరి1న అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ సూట్ (ఐపీఎస్) సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగేలా రూపొందించిన ‘ఆర్పానెట్' నెట్‌వర్క్ ఈ మేరకు ఆ రోజు అధికారికంగా ప్రారంభమైంది. కంప్యూటర్లను అనుసంధానం చేసే ‘ఆర్పానెట్' అనే ఈ కొత్త పద్ధతే తర్వాత ‘వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ)' రాకకు మార్గం సుగమం చేసింది.

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో

వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త టిమ్ బర్నర్స్ కామెడీ బ్యాండ్ బృందంతో కూడిన పోటోను తొలిగా వెబ్‌లో పోస్ట్ చేసారు.

మొట్టమొదటి పోర్నోగ్రాఫిక్ సైట్:

మొట్టమొదటి పోర్నోగ్రాఫిక్ సైట్:

వరల్డ్ వైడ్ వెబ్ విస్తరణలో భాగంగా పోర్న్ వెబ్‌సైట్‌లు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్నెట్ ప్రపంచంలో మొట్టమొదటి పోర్నోగ్రాఫిక్ వైబ్‌సైట్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త గ్యారీ క్రీమెన్ ప్రారంభించారు. వెబ్‌సైట్ పేరు సెక్స్ డాట్ కామ్ (Sex.com)

మొట్టమొదటి ఈ-మెయిల్:

మొట్టమొదటి ఈ-మెయిల్:

రే టాంలిన్సన్ (Ray Tomlinson) 1971లో మొదటిసారిగా ఈ-మెయిల్‌ను పోస్ట్ చేసారు.

Best Mobiles in India

English summary
The first mobile phone call was made 45 years ago, Motorola celebrates with deals More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X