అదిరే ఫీచర్లతో ఎల్‌జి వి30 ప్లస్, ధర చాలా ఎక్కువ..
ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎల్‌జి వి30 ప్లస్‌తో మార్కెట్లోకి దూసుకువస్తోంది.
మొబైల్ దిగ్గజం ఎల్‌జి ఈ ఏడాది రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో మార్కెట్ లోకి దూసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎల్‌జి వి30 ప్లస్‌తో మార్కెట్లోకి దూసుకువస్తోంది. ఎల్‌జి వి30లో ఉన్న ఫీచర్లే ఈ ఫోన్‌లోనూ ఉండనున్నాయి.

ర్యామ్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. కాగా ఎల్‌జి వి30 ప్లస్‌లో స్టోరేజ్ ని పొడిగించారు. ఈ నెల 13వ తేదీన విడుదల కానున్న ఈ ఫోన్ ధరను రూ.58,900గా నిర్ణయించారు. 6 ఇంచ్ భారీ బెజెల్ డిస్‌ప్లే, వెనుక భాగంలో 16, 13 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు పవర్‌ఫుల్ కెమెరాల,ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.

ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే,
2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్,
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
16, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు,
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్,
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ,
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి,
3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








