పైసా వసూల్ ఫోన్ ఇదే..

డ్యుయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌ ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ ఫోన్ ధర రూ.19,990.

|

ఒప్పో కంపెనీ, తన 'Selfie Expert' ఫ్యామిలీ నుంచి మరో ఆసక్తికర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. OPPO F3 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్, ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒప్పో ఎఫ్ 3 ప్లస్‌కు జూనియర్ వర్షన్‌గా భావించవచ్చు. డ్యుయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌ ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ ఫోన్ ధర రూ.19,990. ఇన్నోవేటివ్ ఫ్రంట్ కెమెరాలతో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్న ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...

 

మొబైల్ కెమెరా టెక్నాలజీలో ఒప్పోకు సాటి లేదు..

మొబైల్ కెమెరా టెక్నాలజీలో ఒప్పోకు సాటి లేదు..

మొబైల్ కెమెరా టెక్నాలజీ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఒప్పో 2010 నుంచి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. తన మొబైల్ కెమెరాల కోసం ఒప్పో తీసుకువచ్చిన బ్యూటిఫై మోడ్ (Beautify mode), స్ర్కీన్ ఫ్లాష్ (screen flash), రొటేటింగ్ కెమెరా (rotating camera), అల్ట్రా హెచ్‌డి మోడ్ (Ultra HD mode) వంటి ఇమేజింగ్ టెక్నాలజీ మొబైల్ ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి.

డ్యుయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌..

డ్యుయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌..

OPPO F3 Plus తరహాలోనే OPPO F3 కూడా తన డ్యుయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌తో సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది. OPPO F3 ఫోన్‌లో చేసిన డ్యుయల్ సెల్ఫీ కెమెరా ద్వారా స్టన్నింగ్ క్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు.

 

 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ సెటప్‌..
 

16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ సెటప్‌..

Oppo F3 ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ సెటప్‌తో వస్తోంది. 120 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి. ఫోన్‌ వెనుక భాగంలో ఏర్పాటు 13 మెగా పిక్సల్ సెన్సార్ తక్కువ వెళుతురు కండీషన్ లలోనూ హైక్వాలిటీ ఫోటోలను క్యాప్చుర్ చేస్తుంది.

గ్రూప్ సెల్ఫీలు కేక..

గ్రూప్ సెల్ఫీలు కేక..

OPPO F3 ఫ్రంట్ కెమెరాలతో క్యాప్చుర్ చేసుకునే గ్రూప్ సెల్ఫీలు క్వాలిటీకే కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి. స్టాండర్డ్ లెన్స్ అలానే వైడ్ యాంగిల్స్ లెన్స్ మాడ్యుల్స్‌తో బిల్డ్ కాబడిన ఈ డ్యుయల్ సెల్ఫీ కెమెరా సరికొత్త ఫోటోగ్రఫీ అనుభూతులను చేరువచేస్తుంది.

 

స్టాండర్డ్ కెమెరా లెన్స్...

స్టాండర్డ్ కెమెరా లెన్స్...

OPPO F3 డ్యుయల్ సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేసిన స్టాండర్డ్ కెమెరా లెన్స్ సబ్జెక్ట్‌లోని HDR, vivid depth, minimized noise వంటి అంశాల పై ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ఇదే సమయంలో వైడ్ యాంగిల్ లెన్స్ ఫీల్డ్ వ్యూకు సంబంధించిన అంశాల పై ప్రధానంగా ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా సెల్ఫీ పానోరమా మోడ్ ను ఉపయోగించుకునే సమయంలో ఈ వైడ్ యాంగిల్ లెన్స్

మరింత యాక్టివ్‌గా పనిచేస్తుంది.

 

క్వాలిటీ మిస్ అవ్వదు..

క్వాలిటీ మిస్ అవ్వదు..

OPPO F3 ఫోన్ ద్వారా గ్రూప్ సెల్ఫీ షాట్‌లను ఏమాత్రం క్వాలిటీ మిస్ కాకుండా క్యాప్చుర్ చేసుకోవచ్చు. OPPO F3 కెమెరాలో పొందుపరచబడిన Beautify 4.0 సాఫ్ట్‌వేర్ క్లియర్ కట్ సెల్ఫీలను ప్రొవైడ్ చేస్తుంటే. అంటే సెల్ఫీ క్యాప్చుర్ చేసుకునే సమయంలో లైటింగ్ దగ్గర నుంచి అడ్జస్టబుల్ టోన్స్ వరకు పర్‌ఫెక్ట్‌గా అడ్జస్ట్ కాబడతాయి.

డ్యూరబులిటీ విషయంలోనూ నెం.1

డ్యూరబులిటీ విషయంలోనూ నెం.1

స్టైల్ ఇంకా డ్యూరబులిటీ విషయంలో, ఏ మాత్రం రాజీ పడకుండా OPPO F3 ఫోన్‌ను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. స్లీక్ మెటల్ యునిబాడీ డిజైన్ ఈ ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువచ్చింది. మల్టీస్టేజ్ తయారీ ప్రాసెస్‌లో భాగంగా వివిధ దశల్లో ఈ ఫోన్‌లకు సాండ్ స్ప్రేయింగ్, స్టేజ్ పాలిషింగ్, అనేక రౌండ్ల సీఎన్‌సీ మిల్లింగ్ ఇవ్వటం జరుగుతుంది. దీంతో OPPO F3 ఫోన్‌ మరింత స్మూత్‌నెస్‌ను సంతరించుకుని ప్రీమియమ్ లుక్‌లో కనిపిస్తుంది.

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

స్ర్కీన్ విషయానికి వచ్చేసరికి ఒప్పో ఎఫ్3 ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్ స్ర్కీన్‌కు రక్షణ కవచంలా నిలుస్తుంది.

ఎంబెడ్ చేయబడిన స్మార్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్

ఎంబెడ్ చేయబడిన స్మార్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్

ఫోన్ హోమ్ బటన్‌లో ఎంబెడ్ చేయబడిన స్మార్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరింత స్మూత్ గా స్పందిస్తోంది. ఈ స్కానర్‌లో పొందుపరిచిన బయోమెట్రిక్ సెన్సార్ అలానే హైక్రోఫోబిక్ మెంబ్రేన్ వ్యవస్థలు స్కానర్ పై వేలును ఉంచిన ప్రతిసారి సహజసద్థమైన అనుభూతులకు లోను చేస్తాయి.

 

హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్..

హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్..

Oppo F3 ఫోన్‌లోని హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే.. ఆక్టా కోర్ MediaTek MT6750T చిప్‌సెట్ పై ఫోన్ రన్ అవుతుంది. Mali T86-MP2 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

ColorOS 3.0 స్కిన్

ColorOS 3.0 స్కిన్

ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి Oppo F3 ఫోన్‌ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ColorOS 3.0 స్కిన్ పై రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే Oppo F3 ఫోన్‌ 3,200mAh బ్యాటరీతో వస్తోంది.

శక్తివంతమైన 3,200 mAh బ్యాటరీ

శక్తివంతమైన 3,200 mAh బ్యాటరీ

బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి ఒప్పో ఎఫ్3 ఫోన్లో శక్తివంతమైన 3,200 mAh బ్యాటరీని ఏర్పాటు చేసారు. OPPO's VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్ 4.1, ఫింగర్ ప్రింట్ స్కానర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్ సపోర్ట్.

ఫైనల్ రివ్యూ...

ఫైనల్ రివ్యూ...

హైస్టాండర్డ్ కెమెరా సెటప్, డ్యూరబుల్ డిజైన్, పెద్దదైన డిస్‌ప్లే, అబ్బురపరిచే మల్టిమీడియా ఎక్స్‌పీరియన్స్, శక్తివంతమైన ప్రాసెసింగ్ వంటి అంశాలు ఒప్పో ఎఫ్3 ఫోన్‌ను రూ.20,000 రేంజ్‌‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలబెట్టాయని బలంగా చెప్పొచ్చు.

Best Mobiles in India

English summary
The new Selfie Expert OPPO F3 brings the perfect combination of style and performance. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X