స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 3310 ఎందుకుని బెస్ట్..?

కొన్ని కోణాల్లో మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే నోకియా ఐకానిక్ ఫోన్ నోకియా 3310 సుపీరియర్ అనిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామ్‌సంగ్, యాపిల్, హెచ్‌టీసీ కంపెనీలకు చెందని హై-ఎండ్ ఫోన్‌లతో పోలిస్తే నోకియా 3310 బెస్ట్ అనటానికి పలు కారణాలను ఇప్పుడు చూద్దాం..

Read More : సంచలన ఆఫర్లతో దూసుకొస్తున్న 'Moto Days'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పగుళ్లు లేదా ప్రమాదాలు ఏర్పడినప్పుడు

పగుళ్లు లేదా ప్రమాదాలు ఏర్పడినప్పుడు నోకియా 3310 ప్యానల్‌ను సులువుగా మార్చుకోవచ్చు.అదే సమస్య లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లలో తలెత్తినట్లయితే బోలెడంత సమయంతో పాటు డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది.

బ్యాటరీ బ్యాకప్ విషయంలో..

హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే నోకియా 3310 ఫోన్ పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది.

ధరల విషయానికొస్తే..

సామ్‌సంగ్, యాపిల్, హెచ్‌టీసీ కంపెనీలకు చెందని హై-ఎండ్ ఫోన్‌లను సొంతం చేసుకోవలంటే కనీసం రూ.40,000 వరకు పెట్టాలి. ఇదే సమయంలో నోకియా 3310 యూనిట్ ధర రూ.1200 నుంచ రూ.2,000 మధ్య ఉంటుంది.

నోకియా డిస్‌ప్లే ఎండలో సైతం..

మండుటెండలో వెళుతురు ఎక్కువు పడటం కారణంగా స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు సరిగ్గా కనిపించవు. నోకియా 3310 మోనోక్రోమ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఎండలో సైతం సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఎక్కువ సౌండ్‌తో రింగ్‌టోన్స్..

నోకియా 3310లోని మోనోక్రోమిక్ రింగ్‌టోన్‌లు స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే మరింత ఎక్కువ సౌండ్‌తో వినిపిస్తాయి.

రింగ్‌టోన్‌లను కంపోజ్ చేసుకునే అవకాశం..

నోకియా 3310లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఇన్-బుల్ట్ టూల్ ద్వారా 5 రింగ్‌టోన్‌లను కంపోజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లలో లేకపోవచ్చు.

నోకియాలో ప్రీలోడెడ్ గేమ్స్..

నోకియా 3310లో నాలుగు ప్రీలోడెడ్ గేమ్స్ ఉన్నాయి. అవి ప్యారిస్1, స్పేస్ ఇంపాక్ట్, బాంటుమి, స్నేక్ 2. నేటి ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్లలో వేలాది ఆన్‌లైన్ గేమ్‌లు సపోర్ట్ చేస్తున్నప్పటికి ఒక్క ప్రీలోడెడ్ గేమ్ కూడా హ్యాండ్‌సెట్‌లలో లేదు.

కొన్ని కోణాల్లో చూస్తే..

ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే నోకియా 3310 దొంగలను ఏ మాత్రం ఆకర్షించదు. ఇలా, కొన్ని కోణాల్లో చూస్తే స్మార్ట్‌ఫోన్‌ల కంటే నోకియా 3310 చాలా బెస్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Nokia 3310 is in some ways better than Smartphones. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot