అభిమానులకు చేదు వార్తని అందించిన గూగుల్

Written By:

సెర్చ్ ఇంజిన్‌లో దూసుకుపోతున్న ప్రముఖ దిగ్గజం గూగుల్ అభిమానులకు చేదు వార్తను అందించింది. గూగుల్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాన్ని ప్రస్తుతం ఆపివేసింది. ఇకపై ఈ ఫోన్లు గూగుల్ స్టోర్లలో ఎక్కడా అందుబాటులో ఉండవని కంపెనీ తెలిపింది. కాగా 2016 అక్టోబర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను గూగుల్‌ లాంచ్‌ చేసింది. కాగా గూగుల్‌ పిక్సల్‌ హార్డ్‌వేర్‌ కింద వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్లు ఇవే. గూగుల్‌ స్టోర్‌ నుంచి ఇక అందుబాటులో ఉండని ఈ స్మార్ట్‌ఫోన్లు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, బెస్ట్‌ బై వంటి పలు ఆన్‌లైన్‌ స్టోర్లలో మాత్రమే లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం గూగుల్‌ తన స్టోర్‌లో స్మార్ట్‌ఫోన్‌ కేటగిరీ కింద కేవలం పిక్సెల్‌ 2, పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లనే లిస్టు చేసింది.

అభిమానులకు చేదు వార్తని అందించిన గూగుల్

కాగా 32జీబీ, 128జీబీ వేరియంట్లలో పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. 32జీబీ వేరియంట్‌ ధర రూ.57వేలకు ధరతో మార్కెట్‌లోకి రాగ, 128జీబీ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.66వేలతో లాంచ్‌ అయింది. పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ వేరియంట్‌ ధర రూ.67వేలు కాగ, 128జీబీ వేరియంట్‌ ధర రూ.76వేలుగా ఉంది. పిక్సల్‌ 2, పిక్సల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లపై ఎక్కువగా ఫోకస్‌ చేయడానికి ఒరిజినల్‌ పిక్సెల్‌ ఫోన్లను గూగుల్‌ తన ఆన్‌లైన్‌ స్టోర్‌ నుంచి తొలగించినట్టు తెలిసింది. ఆ రెండు పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లకు క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 821 ఎస్‌ఓసీ, 4జీబీ ర్యామ్‌, 12.3 మెగాపిక్సెల్‌ బ్యాక్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 5 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే, 5.5 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే ఉన్నాయి.

వాట్సప్ యూజర్ల డేటా చౌర్యం,పేమెంట్ చేస్తే అంతే సంగతులు !

గూగుల్‌ పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు
5.5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే
1.6గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 821 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌
32జీబీ, 128 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు
3450 ఎంఏహెచ్‌ లిథియం-మెటల్‌ బ్యాటరీ
12.3 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
గూగుల్‌ ఆండ్రాయిడ్‌ 7.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌

English summary
The original Pixel and Pixel XL are no longer available on the Google Store More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot