Home
Mobile

8జీబీ ర్యామ్‌తో మార్కెట్లోకి దూసుకొచ్చిన రేజర్‌ ఫోన్‌ 2..ధర ఎంతంటే?

మొబైల్స్ తయారీదారు రేజర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ రేజర్ ఫోన్ 2 మార్కెట్లోకి తీసుకొచ్చింది.

మొబైల్స్ తయారీదారు రేజర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ రేజర్ ఫోన్ 2 మార్కెట్లోకి తీసుకొచ్చింది. రేజర్‌ ఫోన్‌ సిరీస్‌ గేమింగ్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను అమెరికా, కెనడా, యూకే, యూరప్ మార్కెట్‌లలో విడుదల చేసింది. ఇతర దేశాల్లోనూ ఈ ఏడాది చివరి నాటికి లభ్యం కానుంది. భారీ ర్యామ్‌, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ , ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ లాంటి అద్భుత ఫీచర‍్లతో లాంచ్‌ చేసిన ఈస్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ.59,500 గా ఉండనుంది.

ఫీచర్స్...

ఫీచర్స్...

5.72 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0, వైర్‌లెస్ చార్జింగ్.

గేమింగ్ అనుభూతి

గేమింగ్ అనుభూతి

నేటి తరం స్మార్ట్ ఫోన్లు గేమింగ్ ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న తరుణంలో కంపెనీ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధను పెట్టింది. ఫోన్ డిజైనింగ్ లా భారీ మార్పులను చేసింది.

డిస్‌ప్లే...

డిస్‌ప్లే...

ఈ ఫోన్ 5.72 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే తో వస్తోంది.స్క్రీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 2560 x 1440 పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేసే వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. వీడియోలను స్ట్రీమ్ చేస్తున్న సమయంలో, గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఈ హైడెఫినిషన్ డిస్‌ప్లే మంచి వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

కెమెరా..

కెమెరా..

రేజర్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ కెమెరా డిపార్ట్‌మెంట్‌ను పరిశీలించినట్లయితే 12 మెగాపిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ను అమర్చారు .

ర్యామ్,స్టోరేజ్,బ్యాటరీ...

ర్యామ్,స్టోరేజ్,బ్యాటరీ...

ఈ రేజర్ ఫోన్ 2 , 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో మార్కెట్లోకి వచ్చింది 2 టీబీ వరకు స్టోరేజ్ ను ఎక్స్‌పాండబుల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ ఫోన్ లో అమర్చిన 4000mAh బ్యాటరీ, సింగిల్ ఛార్జ్ పై ఏకంగా రెండురోజుల నికరమైన బ్యాటరీ బ్యాకప్ ను ఆఫర్ చేస్తుంది.

హార్డ్‌వేర్,సాఫ్ట్‌వేర్....

హార్డ్‌వేర్,సాఫ్ట్‌వేర్....

ఈ ఫోన్ 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా చేయబడిన ఈ ఫోన్ భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ 9.0 పై అప్‌డేట్ లభించే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
The Razer Phone 2 is poised to be the gaming phone to beat. To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X