ఆగష్టు 21న Android O రిలీజ్!

ఆండ్రాయిడ్ తరువాతి వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం Android Oను ఆగష్టు 21న మార్కెట్లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన డెవలపర్ ప్రివ్యూను మార్చి 2017లో గూగుల్ రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రివ్యూ ఇప్పటికి పబ్లిక్‌కు అందుబాటులోకి రాలేదు.

Read More : మన ఫోన్ 100 సంవత్సరాల తరువాత

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆగష్టు 21న దాదాపుగా మార్కెట్లో రిలీజ్

వెంచుర్ బీట్ జర్నలిస్ట్ ఇవాన్ బ్లాస్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా లీక్ చేసిన వివరాల ప్రకారం ఆండ్రాయిడ్ ‘ఓ'కు సంబంధించిన ఫైనల్ కన్స్యూమర్ వర్షన్ ఆగష్టు 21న దాదాపుగా మార్కెట్లో రిలీజ్ కాబోతోంది.

తొలత వీటికే లభిస్తుంది..

తొలత ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ గూగుల్ సొంత డివైస్‌లైన Google Pixel, Google Pixel XL, Nexus 5X, Nexus 6P, Nexus Player, Google Pixel Cలకు లభిస్తుంది.

విప్లవాత్మక ఫీచర్లు..

గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో విప్లవాత్మక మార్పులకు నాందిపలికే విధంగా డిజైన్ చేయబడిన Android O ఆపరేటింగ్ సిస్టంలో పిక్షర్ ఇన్ పిక్షర్ వీడియో వ్యూవింగ్ మోడ్‌తో పాటు నోటిఫికేషన్ ఛానల్స్, బెటర్ కీబోర్డ్ నేవిగేషన్, వైడర్ కలర్ గామట్ ఇన్ ఇమేజింగ్ యాప్స్ వంటి కొత్త ఫీచర్లు ఈ ఫ్లాట్‌ఫామ్‌లో ఉండనున్నాయి.

మెరుగైన బ్యాటరీ లైఫ్

Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో గతంలో కన్నా బ్యాటరీ లైఫ్ మరింత ఎక్కువగా వచ్చేలా డిజైన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్ బ్యాటరీ వాడుకోవడాన్ని నియంత్రించే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇందులో తీర్చిదిద్దారు.

నోటిఫికేషన్ కంట్రోల్..

Android O ఆపరేటింగ్ సిస్టంలో యూజర్లు నోటిఫికేషన్లను మరింతగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే అవసరం లేని నోటిఫికేషన్లను బ్లాక్ చేయవచ్చు. కావాలనుకుంటే వాటిని కొంత సేపు అయ్యాక మళ్లీ కన్పించేలా రిమైండర్ సెట్ చేసుకోవచ్చు.

డేటాకు అదనపు సెక్యూరిటీ..

Android O ఆపరేటింగ్ సిస్టం యూజర్లు ఫోన్‌లో సేవ్ చేసుకునే డేటా మరింత సురక్షితంగా ఉండేదుగాను గూగుల్ కొత్త యాప్‌లను తీసుకువచ్చింది.

మల్టీ విండో మోడ్‌

రెండు, మూడు యాప్‌లను ఒకేసారి స్క్రీన్‌పై వాడుకునేందుకు వీలుగా Android Oలో మల్టీ విండో మోడ్‌ను గూగుల్ అందిస్తోంది..

కొత్త ఫాంట్స్‌తో మరింత అందంగా...

గతంలో లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలతో పోలిస్తే Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో మరిన్ని కొత్త ఫాంట్లను గూగుల్ చేర్చింది. వాటితో యూజర్లు తమ డివైస్‌లోని ఫాంట్‌లను తమ ఇష్టాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

న్యూ ఐకాన్స్...

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌తో పోలిస్తే Android O ఆపరేటింగ్ సిస్టమ్‌లో పలు ఐకాన్లను చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల డిస్‌ప్లేలపై కూడా డివైస్ స్క్రీన్ మరింత ప్రకాశవంతంగా కనిపించేలా ఏర్పాటు చేశారు.

క్రాష్ కాకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌

మీరు ఇంటర్నెట్ బ్రౌజర్లలో వెబ్‌సైట్లను చూస్తున్నప్పుడు అవి క్రాష్ కాకుండా ఉండేందుకు గాను Android Oలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసారు.

రెండు రెట్ల వేగంతో..

గతంలో లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలతో పోలిస్తే Android O రెండు రెట్లు వేగంతో పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The release date for Android O may finally have been confirmed: Report. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot