ఈ ఫోన్‌లో ఒకేసారి 20 యాప్స్ రన్ చేసుకోవచ్చు!

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన పాపులర్ F1s స్మార్ట్‌ఫోన్ లైనప్ నుంచి OPPO F1s పేరుతో సరికొత్త స్మార్ట్‌‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హైక్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్, శక్తివంతమైన స్టోరేజ్, మన్నికైన మల్టీటాస్కింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను బెస్ట్-క్లాస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా తీర్చిదిద్దాయి...

Read More : ఫోన్ చేస్తే చాలు, డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోన్న ఈ ఫోన్‌లో 1000కు పైగా పర్‌ఫెక్ట్ సెల్ఫీలను స్టోర్ చేసుకోవచ్చు. ఒక్క సెల్ఫీలే కాకుండా మీకు నచ్చిన సినిమాలు, పాటలు, 3డీ గేమ్స్, యాప్స్, డాక్యుమెంట్స్ ఇలా అనేక రకాల కంటెంట్‌ను ఈ ఫోన్‌లో నిశ్చింతగా స్టోర్ చేసుకోవచ్చు.

4జీబి ర్యామ్‌ కెపాసిటీ..

ఏకంగా 4జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో మల్టిపుల్ యాప్స్‌ను రన్ చేసుకోవచ్చు. అంటే ఒకవైపు వీడియోలు చూస్తూనే, గ్రాఫికల్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఒకే సమయంలో ఇన్ని పనులు చేస్తున్నప్పటికి ఫోన్ పనితీరు ఏ మాత్రం నెమ్మదించదు. ఈ ఫోన్‌లో ఒకే సారి 20 యాప్స్ రన్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యునిక్ పిక్సల్ అరేంజ్‌మెంట్ టెక్నాలజీ

OPPO F1s ఫోన్ 16 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. ఈ కెమెరాలో ఉపయోగించిన యునిక్ పిక్సల్ అరేంజ్‌మెంట్ టెక్నాలజీ ఫోటోలకు రిచ్ కలర్స్‌ను అద్దటంతో పాటు సహజసిద్ధమైన కలర్ టోన్‌లను సమకూరుస్తుంది.

Beautify 4.0

Beautify 4.0 పేరుతో మరో సరికొత్త ఫీచర్‌ను ఈ కెమెరాలో పొందుపరచటం జరిగింది. ఏడు బ్యూటీ లెవల్స్‌తో పాటు రెండు స్కిన్ టోన్ మోడ్ లను కలిగి ఉండే ఈ టూల్ సెల్ఫీలను మరింత ప్రకాశవంతంగా క్లియర్ స్కిన్‌తో ప్రొడ్యూస్ చేస్తుంది. గ్రూప్ సెల్ఫీలను చిత్రీకరించుకునే విధంగా 'Selfie Panorama' మోడ్ ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది.

 

గ్రే కలర్ వేరియంట్‌

OPPO F1s ఫోన్‌ను సరికొత్త గ్రే కలర్ వేరియంట్‌లో ఒప్పో అందించనుంది. మెటల్ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్ సింపుల్ లుక్స్‌తో స్టన్నింగ్ అప్పీల్‌ను సొంతం చేసుకుంటుంది. ‌

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే..

ఫోన్ డిస్‌ప్లే విభాగాన్ని పరిశీలించినట్లయితే OPPO F1s ఫోన్ 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. 2.5డి కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Upgraded OPPO F1s steps up the Way you take selfies. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot