శాంసంగ్,షియోమిల మధ్య యుద్ధం, కొన్ని ఆసక్తికర విషయాలు

ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తూ పోతోంది. విదేశీ కంపెనీలు టెక్ ఉత్పత్తి ఏదీ రిలీజ్ చేయాలన్నా ముందుగా ఇండియా మార్కెట్ వైపే చూస్తున్నాయి. చైనా దిగ్గజాలు అమెరికా కంపెనీలు, అలాగే దక్ష

|

ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తూ పోతోంది. విదేశీ కంపెనీలు టెక్ ఉత్పత్తి ఏదీ రిలీజ్ చేయాలన్నా ముందుగా ఇండియా మార్కెట్ వైపే చూస్తున్నాయి. చైనా దిగ్గజాలు అమెరికా కంపెనీలు, అలాగే దక్షిణ కొరియా టెక్ గెయింట్స్ జపాన్.. ఇలా ప్రతీ దేశపు టెక్ దిగ్గజాలు తమ చూపును ముందుగా ఇండియా వైపుకు తిప్పుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా మార్కెట్లో చైనా దిగ్గజం షియోమి, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేకర్ శాంసంగ్ ఇండియాలో నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి.

శాంసంగ్,షియోమిల మధ్య యుద్ధం, కొన్ని ఆసక్తికర విషయాలు

యూజర్లను ఆకట్టుకునే క్రమంలో అనేక రకాలైన ఆఫర్లకు తెరలేపుతున్నాయి. వీరిద్దరి మధ్య వార్ ఇప్పట్లో ఆగిపోయే సూచనలు కనపడటం లేదు. ఈ నేపధ్యంలో వీరి వార్ మధ్య కొన్ని ఆసక్తికర విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ధరలో పోటీ

ధరలో పోటీ

ఈ రెండు దిగ్గజాలు ఇండియాలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు అట్రాక్టివ్ ధరలను అందిస్తున్నాయి. శాంసంగ్ ఇప్పటికే ఈ వరసలో ముందు దూసుకుపోగా షియోమి శాంసంగ్ ను ఈ మధ్య వెనక్కి నెట్టివేసి అగ్రగామిగా నిలిచింది.

శాంసంగ్ న్యూ సీరిస్ ఫోన్లు

శాంసంగ్ న్యూ సీరిస్ ఫోన్లు

హైఎండ్ మార్కెట్లో సత్తా చాటిన శాంసంగ్ లోఎండ్ మార్కెట్లో కూడా దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది. షియోమి లో ఎండ్ మార్కెట్లో సత్తా చాటడంతో దానికి పోటీగా శాంసంగ్ రూ.15 వేల బడ్జెట్లో M10, M20, M30 ఫోన్లను లాంచ్ చేసింది.

షియోమి న్యూ ఫోన్లు

షియోమి న్యూ ఫోన్లు

కాగా చైనా మొబైల్ మేకర్ షియోమి తన న్యూ సీరిస్ ఫోన్లు Redmi Note 7 and Redmi Note 7 Proలను లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లను జోడించి బడ్జెట్ ధరలో వీటిని సరికొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ధరలు తగ్గింపు

ధరలు తగ్గింపు

శాంసంగ్ షియోమితో పోటీ పడేందుకు తన పాత సీరిస్ ఫోన్ల ధరలలను తగ్గిస్తూ వస్తోంది. జె సీరిస్ ఫోన్లు అలాగే ఎమ్ సీరిస్ ఫోన్ల ధరలు గత కొద్ది నెలలుగా తగ్గు ముఖం పట్టాయి.

షియోమి అదే బాటలో..

షియోమి అదే బాటలో..

షియోమి ఏకంగా ఆరు ఫోన్ల ధరలను తగ్గించి వేసింది. Redmi Note 6, Mi A2, Redmi Note 5 Pro ఫోన్లు దాదాపు రూ.3 వేల తగ్గింపును అందుకున్నాయి.

శాంసంగ్ ఎసీరిస్ ఫోన్లు

శాంసంగ్ ఎసీరిస్ ఫోన్లు

శాంసంగ్ కొత్తగా ఎసీరిస్ పేరుతో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది పాత సీరిస్ బోర్ కొట్టిన వారు ఈ సీరిస్ లోకి మారవచ్చు.

ప్రమోషన్

ప్రమోషన్

షియోమి తన ఫోన్ల ప్రమోషన్ విషయంలో చాలా ఎక్కువగా ఖర్చు పెడుతుంది. ఆఫర్లు డిస్కౌంట్ల పేరుతో భారీ తాయిలాలను అందిస్తూ వస్తోంది.

ప్రతి నెలా రెండు ఫోన్లు

ప్రతి నెలా రెండు ఫోన్లు

అనధికార సమాచారం ప్రకారం ఇకపై ప్రతి నెలా శాంసంగ్ ఎ సీరిస్ లో రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు రూ. 10 వేల నుంచి రూ.50 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
The ‘war’ between Samsung and Xiaomi: Why it's 'good news' for you

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X