విండోస్ ఫోన్‌లకు కాలం చెల్లిపోయింది, ఆండ్రాయిడ్‌కి మారిపోండి

|

విండోస్ ఫోన్‌లకు సంబంధించిన సపోర్టును ఈ ఏడాది నిలిపివేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. తన అఫీషియల్ వెబ్‌సైట్‌కు సంబంధించిన FAQ పేజీలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం విండోస్ 10 మొబైల్‌కు డిసెంబర్ 10, 2019 తరువాత నుంచి కొత్త సెక్యూరిటీ అప్‌డేట్స్ అనేవి లభించవు. ఇదే సమయంలో నాన్-సెక్యూరిటీ హాట్ ఫిక్సెస్, ఆన్‌లైన్ టెక్నికల్ కంటెంట్ అప్‌డేట్స్ కూడా వర్తించవు. కాబట్టి, విండోస్ 10 యూజర్లు వీలైనంత త్వరగా ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ఐఫోన్‌కు అప్‌డేట్ అవ్వాలని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది.

The Windows phone is officially dead and gone, urges users to move to Android or iphone

విండోస్ 10 మొబైల్ (వెర్షన్ 1709) పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లకు డిసెంబర్ 10, 2019 చివరి తేదీ కాగా, వెర్షన్ 1703 పై రన్ అవుతోన్న లుమియా 640, లుమియా 640 ఎక్స్ఎల్ వంటి స్మార్ట్‌ఫోన్‌లకు జూన్ 11, 2019తోనే సెక్యూరిటీ అప్‌డేట్‌లు నిలిచిపోబోతున్నాయి.

మొబైల్ ఆపరేటింగ్ సిస్టంల విభాగంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్‌లు మార్కెట్‌ను శాసిస్తుండగా, విండోస్ మొబైల్ ఫోన్‌లు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అభివృద్థి చెందుతోన్న దేశాల్లో మైక్రోసాఫ్ట్ ఫోన్‌ల వినియోగం ఆశాజనకంగానే ఉన్నప్పటికి అమ్మకాల మాత్రం దారుణంగా క్షీణించాయి. దీంతో వీటిని మైక్రోసాఫ్ట్ పూర్తిగా నిలిపివేయబోతోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే విండోస్ పోన్‌లు బెస్ట్ యూసేజ్ క్వాలిటీని కలిగి ఉంటాయనటానికి పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

విండోస్ ఫోన్ సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. డివైస్‌లోని యాప్స్ రెప్పపాటులో లోడైపోతాయి. ఫోన్ అరుదుగా హ్యాంగ్ అవటాన్ని మనం చూడొచ్చు. విండోస్ ఫోన్‌లు సింగిల్ ఛార్జ్ పై 13 నుంచి 14 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలవు. హెవీ యూజర్లకు 10 గంటల బ్యాకప్‌ను కచ్చితంగా పొందవచ్చు. విండోస్ ఫోన్‌లను తొలత నోకియా ప్రపంచానికి పరిచయం చేసింది.

నిర్మాణ పరంగా మైక్రోసాఫ్ట్ అందించే విండోస్ ఫోన్ డివైస్‌లు చాలా ధృఢంగా ఉంటాయి. చిన్న చిన్న ప్రమాదాలను ఈ ఫోన్‌లు ఏ మాత్రం లెక్క చేయవు. మైక్రోసాఫ్ట్ నుంచి లుమియా ఫోన్‌లు స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ రూపురేఖలనే మార్చేసాయి. ఈ ఫోన్ కెమెరాలు అందించిన ప్రొఫెషనల్ లెవల్ ఫోటోగ్రాఫ్స్ విండోస్ ఫోన్‌లకు మంచి పేరును తీసుకువచ్చాయి. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైన లుమియా డివైస్‌లలో అనేక కెమెరా కంట్రోల్స్‌ను మనం చూడొచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే విండోస్ ఫోన్‌లను కంఫర్ట్‌గా ఫీలయ్యే యూజర్లు చాలా మందే ఉన్నారు. విండోస్ ఫోన్‌లు అందించే స్వైప్ కీబోర్డ్స్, కస్టమైజబుల్ యాక్షన్ సెంటర్, లాక్ స్ర్ర్కీన్ ఆప్షన్స్, గ్లాస్ స్ర్కీన్ టెక్నాలజీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

Best Mobiles in India

English summary
The Windows phone is officially dead and gone, urges users to move to Android or iphone. Read More in this story in Gizbot Telugu..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X