Home
Mobile

దిగ్గజాలకు షియోమి ఝలక్, మూడు స్క్రీన్లతో డబుల్‌ ఫోల్డబుల్‌ ఫోన్

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమి టాప్ మొబైల్ దిగ్గజాలకు ఝలక్ ఇస్తూ మరోసారి విప్లవాత్మక ఆవిష్కారానికి నాంది పలికింది.

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమి టాప్ మొబైల్ దిగ్గజాలకు ఝలక్ ఇస్తూ మరోసారి విప్లవాత్మక ఆవిష్కారానికి నాంది పలికింది. శాంసంగ్‌, ఎల్‌జీ లాంటి దిగ్గజ సంస్థలు ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణకు అష్టకష్టాలు పడుతోంటే ఈ చైనా స్మార్ట్‌ఫోన్‌ సంచలనం ఏకంగా మూడు స్క్రీన్లతో డబుల్‌ ఫోల్డబుల్‌ డివైస్‌ను పరిచయం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మడిచివేసేందుకు అనువైన మూడు స్క్రీన్ల మొబైల్‌ని రిలీజ్ చేసింది. ఈ మేరకు షియోమి సహ వ్యవస్థాపకుడు లిన్-బిన్ చైనా వెబ్‌సైట్ వైబోలో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియోలో ఏముంది

షియోమి అధినేత పోస్ట్ చేసిన వీడియోలో టాబ్లెట్ సైజులో ఉండే ఈ ఫోల్డబుల్‌ ఉంది. ఈ మొబైల్ విశేషం ఏమిటంటే...ఈ ఫోన్‌ను తెరచి..ఫోల్డ్ చేయగానే చిన్న సెంట్రల్ డిస్‌ప్లే కనబడుతుంది. మరోసారి ఫోల్డ్‌ చేస్తే లోపల మరో రెండు స్క్రీన్స్ కనిపిస్తాయి. అలాగే మడిచివేసిన స్క్రీన్‌లోని భాగాలు డీ-యాక్టివేట్ అయిపోయి తిరిగి యధాతధ స్థితికి చేరుకుంటాయట. అయితే వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఇతర విషయాలు

ఇతర విషయాలు

అయితే ఈ వీడియోలో కేవలం ఫోల్డబుల్ అంశం మీద మాత్రమే చూపించారు. ఈ డివైస్‌లోని ఇతర ఫీచర్లు, కెమెరా గురించి ఈ వీడియోలో ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఫ్లెక్సిబుల్ ఫోల్దింగ్ స్క్రీన్ టెక్నాలజీతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తాము ఇలాంటి ఫోన్‌ని డెవలప్ చేశామని లిన్-బిన్ తెలిపారు.

 

 

ప్రాధమిక దశలో

ప్రాధమిక దశలో

ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రాథమికంగా ఇంజనీరింగ్ మోడల్‌లో ఉందనీ, మరింత అభివృద్ది పరుస్తామని ఆయన తెలిపారు. అలాగే డిమాండ్ ఆధారంగా వీటిని ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రస్తుతం షియోమీ డ్యుయెల్ ఫ్లెక్స్, షియోమీ మిక్స్ ఫ్లెక్స్ అనే పేర్లను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

మీరే పేరు పెట్టండి

మీరే పేరు పెట్టండి

అంతేకాదు ఇంకా మార్కెట్లోకి రాని ఈ త్రీ స్క్రీన్ ఫోన్‌కి ఎవరైనా పేరు పెట్టవచ్చునని లిన్ ఆహ్వానించారు. అందుకే ఈ ఫోన్‌ను అందరికీ పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. కామెంట్లు, లైకుల ఆధారంగా, అందరికీ నచ్చితే.. భవిష్యత్తులో భారీ సంఖ్యలో వీటిని తయారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరి ఇది మార్కెట్లో ఎటువంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.

Best Mobiles in India

English summary
The Xiaomi foldable phone concept looks incredible in new teaser video More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X