Home
Mobile

2020లో ధర తగ్గింపును పొందిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

2020 సంవత్సరం మొదలయి ఒక నెల కాకముందే శామ్‌సంగ్, రియల్‌మి, ఒప్పో వంటివి ఇండియాలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసారు. కొత్త సంవత్సరం ప్రారంభంతో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు కొన్ని తమ పాత స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరల మీద తగ్గింపు ధరను ప్రకటించాయి.

స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఫోన్‌లలో శామ్‌సంగ్ గెలాక్సీ S10 + వంటి టాప్-ఎండ్ ప్రీమియం ఫోన్‌ల నుండి వివో Z1 ప్రో వంటి మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్‌ల వరకు అన్ని ఉన్నాయి. వాటి యొక్క జాబితాను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

 Samsung Galaxy S10

Samsung Galaxy S10

రూ.16,100 తగ్గింపు ధరను పొందిన తరువాత శామ్‌సంగ్ గెలాక్సీ S10 స్మార్ట్‌ఫోన్ ను ఇప్పుడు రూ.54,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో మరియు 16Mp ప్రైమరీ సెన్సార్‌తో గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

 

 

Samsung Galaxy S10+

Samsung Galaxy S10+

రూ.17,100 తగ్గింపు ధరను పొందిన తరువాత శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10 + స్మార్ట్‌ఫోన్ యొక్క 128Gb స్టోరేజ్ మోడల్‌ను ఇప్పుడు రూ.61,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఎక్సినోస్ 9820 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

 

 

Samsung Galaxy S10e

Samsung Galaxy S10e

రూ.8,000 తగ్గింపు ధరను పొందిన తరువాత శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 10e స్మార్ట్‌ఫోన్ యొక్క 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ను రూ.47,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 3,100 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది మరియు ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

 

 

Xiaomi Mi A3

Xiaomi Mi A3

చైనా యొక్క ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి యొక్క షియోమి Mi A3 బేస్ మోడల్ 4 జిబి ర్యామ్+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ మీద రూ.1,000 తగ్గింపు ధరను పొందిన తరువాత దీనిని రూ .11,999 కు కొనుగోలు చేయవచ్చు. మరోవైపు 6 జీబీ ర్యామ్ మోడల్ ను రూ.14,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.

 

 

Nokia 6.2

Nokia 6.2

నోకియా 6.2 స్మార్ట్‌ఫోన్ యొక్క 4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ యొక్క తాజా తగ్గింపు ధర తరువాత ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.12,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల ఫుల్ HD + స్క్రీన్‌ను కలిగి ఉండి మరియు 3,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

 

Nokia 7.2

Nokia 7.2

నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్ 4 జిబి ర్యామ్ మరియు 6 జిబి ర్యామ్ వంటి రెండు వేరియంట్ల మీద రూ.3,100 తగ్గింపు పొందిన తరువాత దీనిని రూ.13,499 మరియు రూ .15,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 48MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 3,500mAH వంటి స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉంటాయి.

 

 

Vivo Z1 Pro

Vivo Z1 Pro

వివో Z1 ప్రో యొక్క 4 జిబి ర్యామ్ మోడల్‌ మీద 1,000 రూపాయలు తగ్గింపు పొందిన తరువాత దీనిని రూ.12,990 కు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఇందులోని 6 జీబీ ర్యామ్ వేరియంట్ ఇప్పుడు రూ.13,990 ధర వద్ద లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

 

Vivo Z1 X

Vivo Z1 X

వివో జెడ్ 1X యొక్క 4 జీబీ ర్యామ్ మోడల్‌ మీద 1,000 రూపాయలు తగ్గింపు పొందిన తరువాత ఇది రూ.14,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే 6 జీబీ వేరియంట్ ను రూ.16,990 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్ 712 ఆధారిత ఫన్‌టచ్ OS 9.1తో రన్ అవుతుంది.

ఒప్పో స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో స్మార్ట్‌ఫోన్స్

ఒప్పో A5 2020 స్మార్ట్‌ఫోన్ యొక్క 3 జిబి వేరియంట్ మీద రూ.500 తగ్గింపు తరువాత ఇది రూ.11,490 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్-లెన్స్ రియర్ కెమెరా సెట్ అప్ ను మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఒప్పో K1 మీద రూ.1,000 తాజా తగ్గింపు తరువాత ఇప్పుడు దీనిని రూ.13,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో, 3,600mAH బ్యాటరీ మరియు స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
These 10 Smartphones Got Price Cut in 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X