ఫీచర్ ఫోన్ మార్కెట్లో దుమ్మురేపిన నోకియా

HMD గ్లోబల్ నోకియా ఈ ఏడాది ఫీచర్ ఫోన్ మార్కెట్లో దుమ్మురేపింది. మార్కెట్ మానిటర్ అయిన కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం ఈ ఏడాది నోకియానే ఫీచర్ ఫోన్ మార్కెట్ రారాజని తెలిపింది.

|

HMD గ్లోబల్ నోకియా ఈ ఏడాది ఫీచర్ ఫోన్ మార్కెట్లో దుమ్మురేపింది. మార్కెట్ మానిటర్ అయిన కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం ఈ ఏడాది నోకియానే ఫీచర్ ఫోన్ మార్కెట్ రారాజని తెలిపింది. నోకయా ఫోన్లకు పుల్ డిమాండ్ ఉందని ఈ రీసెర్చ్ పాయింట్ తెలిపింది. ఆ కంపెనీ నుంచి వచ్చిన నోకియా 3310 మార్కెట్ మొత్తాన్ని స్మాష్ చేసి పడేసింది. ఈ ఫోన్ ద్వారానే నోకియా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఫీచర్ ఫోన్ ప్లేయర్ గా అవతరించింది. ఇది 2018 మూడవ్ క్వార్టర్ ఫలితాల్లో వెల్లడయింది.

ఇండియా మార్కెట్లోకి దూసుకొచ్చిన సరికొత్త గేమింగ్ ఫోన్ Nubia Red Magicఇండియా మార్కెట్లోకి దూసుకొచ్చిన సరికొత్త గేమింగ్ ఫోన్ Nubia Red Magic

ఐటెల్ కింగ్

ఐటెల్ కింగ్

గ్లోబల్ మార్కెట్లో టాప్ పొజిషన్ లో ITELనిలిచింది. మరోసారి తన ప్రాభవాన్ని చాటుకుంది. ఈ కంపెనీ ఉత్పత్తులకు ఆఫ్రికన్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఆ మార్కెట్లో సింహభాగం ఈ కంపెనీదే కావడంతో గ్లోబల్ గా టాప్ పొజిషన్ లోకి వచ్చింది.

టాప్ 5 కంపెనీలు

టాప్ 5 కంపెనీలు

టాప్ 5 కంపెనీలను ఓ సారి పరిశీలిస్తే నంబర్ వన్ స్థానంలో ఐటెల్ రెండవ స్థానంలో నోకియా మూడవ స్థానంలో శాంసంగ్, నాలుగవ స్థానంలో రిలయన్స్ జియో, ఐదవ స్థానంలో టెక్నోలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఐటెల్, అలాగే నోకియా యొక్క వాటా ఒక్కొక్కటి 14 శాతంగా ఉంది. రిలయన్స్ జియో వాటా 11 శాతంగా, శాంసంగ్ వాటా 8 శాతంగా టెక్నో వాటా 6 శాతంగా ఉంది.

 

 

అయిదేళ్ళ వరకు

అయిదేళ్ళ వరకు

రానున్నఅయిదేళ్ళ వరకు ఫీచర్ ఫోన్లకు ఎటువంటి ఢోకా లేదని లో బడ్జెట్ యూజర్లు ఈ ఫోన్ల మీదనే ఆసక్తిని కనపరుస్తున్నారని రీసెర్చ్ సంస్థ తెలిపింది. చాలామందికి స్మార్ట్ ఫోన్ వాడకం తెలియకపోవడం కూడా ఫీచర్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉండేలా చేస్తోందని తెలిపింది.

2జీ నుంచి 4జీకి

2జీ నుంచి 4జీకి

కాగా ఫీచర్ ఫోన్లు అలాగే స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు 2జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్ అయ్యాయి. యాప్స్ ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషించడం వల్ల ఫీచర్ ఫోన్లలోకి కూడా అవి చేరాయి. అన్ని రకాల యాప్స్ ఇప్పుడు ఫీచర్ ఫోన్లలో లభిస్తున్నాయి.

 

 

బ్యాటరీ లైఫ్

బ్యాటరీ లైఫ్

కాగా స్మార్ట్ ఫోన్లో పోలిస్తే ఫీచర్ ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ అధికంగా ఉండటం కూడా ఈ ఫోన్లకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పటికే చాలా దేశాల్లో కరెంట్ కొరత వెంటాడుతోంది. దీని వల్ల బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్ల మీదకు ఆ దేశాలోని యూజర్ల దృష్టి పడుతోంది. కాబట్టి ఫీచర్ ఫోన్ మార్కెట్ వేగవంతం అయిందని కౌంటర్ పాయింట్ తెలిపింది.

 

 

కరెంట్ లేని గ్రామాలు

కరెంట్ లేని గ్రామాలు

ఇప్పటికీ కరెంట్ లేని గ్రామాలు ఆఫ్రికా దేశాల్లో ఎన్నో ఉన్నాయి. world bank data of 2014 డేటా ప్రకారం ఆఫ్రికా దేశాల్లో 600 మిలియన్ల జనాభా కరెంట్ లేని ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది. వీరంతా ఫోన్ ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది.

 

 

మరొక రీజన్

మరొక రీజన్

కౌంటర్ పాయింట్ తెలిపిన మరోక అంశం ఏంటంటే ఫీచర్ ఫోన్ సైజులో యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ టైంఫోన్ యూజ్ చేసేవారికి స్మార్ట్ ఫోన్ గురించి అంతగా అవగాహన లేకపోవడం అలాగే వారంతా ఫీచర్ ఫోన్ వైపుకి మళ్లడం కూడా ఈ ఫోన్ మార్కెట్ పెరగడానికి దోహదం చేసిందని తెలిపింది.

 

 

స్మార్ట్ ఫోన్ కి ధీటుగా ఫీచర్ ఫోన్లు

స్మార్ట్ ఫోన్ కి ధీటుగా ఫీచర్ ఫోన్లు

ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన యాప్స్ WhatsApp, Facebook and YouTubeలు ఇప్పుడు ఫీచర్ ఫోన్లో కూడా లభిస్తుండటంతో అందరూ ఫీచర్ ఫోన్ వైపుకు వెళుతున్నారు. వీరంతా స్మార్ట్ ఫోన్ కి అప్ గ్రేడ్ అయ్యేందుకు అయిష్టతను వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
These 5 companies sell most feature phones globally More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X