ఇలా జరుగుతుందని ఊహించామా..?

|

స్మార్ట్‌ఫోన్ అనేది అందుబాటులోకి వస్తుందని, దానిని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చుని మన పూర్వీకులు కలలో కూడా ఊహించి ఉండరు..? ఆధునిక ఆలోచనల పుణ్యమా అంటూ ఉద్భవించిన స్మార్ట్‌ఫోన్ నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచాన్ని శాసించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అన్ని సమాచార అవసరాలను స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే తీర్చుకోగలుగుతున్నాం. అందుబాటులోకి వస్తోన్న అత్యాధునిక టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌లను మ్యాజికల్ మెచీన్‌లుగా మార్చేస్తోంది. నవశకానికి నాంది పలికన స్మార్ట్‌ఫోన్‌ తన సామర్థ్యాలను ఊహకందని రీతిలో విస్తరించుకుంటోన్న వైనాన్ని ఇప్పుడు చూద్దాం..

Read More : రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్ (లేటెస్ట్)

స్మార్ట్‌ఫోన్ మెటల్ డిటెక్టర్‌ టెక్నాలజీ

స్మార్ట్‌ఫోన్ మెటల్ డిటెక్టర్‌ టెక్నాలజీ

స్మార్ట్‌ఫోన్ మెటల్ డిటెక్టర్‌ టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇవి భూమిలో అమర్చిన బాంబులను సెకన్ల వ్యవధిలో పసిగట్టగలవట. ఇండియా వంటి దేశాలకు ఇటువంటి సెక్యూరిటీ గాడ్జెట్ ఫోన్ చాలా అవసరం.

స్మార్ట్‌ఫోన్ రైఫిల్ సైట్స్

స్మార్ట్‌ఫోన్ రైఫిల్ సైట్స్

ఈ టెక్నాలజీ సహాయంలో లక్ష్యాలను అలవోకగా గురిచూసి షూట్ చేయవచ్చు.  

స్మార్ట్‌ఫోన్ హెల్త్ స్క్రీనింగ్ టెక్నాలజీ

స్మార్ట్‌ఫోన్ హెల్త్ స్క్రీనింగ్ టెక్నాలజీ

కొరియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ హెల్త్ స్క్రీనింగ్ టెక్నాలజీ పై కసరత్తు చేస్తోంది. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే స్మార్ట్‌ఫోన్‌లు డిజిటల్ డాక్టర్‌లుగా వ్యవహరిస్తాయి.

యుద్ధ దాడులను పసిగట్టే యంత్రాలుగా..

యుద్ధ దాడులను పసిగట్టే యంత్రాలుగా..

రసాయన యుద్ధ దాడులను స్మార్ట్‌ఫోన్‌లు పసిగట్టగలుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం ఈ యాంటీ కెమికల్ వార్‌ఫేర్ సాఫ్ట్‌వేర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

స్మార్ట్‌ఫోన్‌లే కార్లను డ్రైవ్ చేస్తే..

స్మార్ట్‌ఫోన్‌లే కార్లను డ్రైవ్ చేస్తే..

స్మార్ట్‌ఫోన్‌లే కార్లను డ్రైవ్ చేసేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్. ప్రయోగ దశలో ఉన్నఈ ప్రాజెక్ట్ త్వరలోనే కమర్షియల్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

మెడికల్ ప్రయోగశాలలుగా..

మెడికల్ ప్రయోగశాలలుగా..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు స్మార్ట్‌ఫోన్‌లు హెల్త్ మానిటరింగ్ సెన్సార్ వ్యవస్థలను కలిగి మెడికల్ ప్రయోగశాలలుగా ఉపయోగపడుతున్నాయి.

చెట్ల నరకివేతకు అడ్డుకట్ట..

చెట్ల నరకివేతకు అడ్డుకట్ట..

ఇండోనేషియాలోని వర్షారణ్యాలలో చెట్ల నరకివేతను స్మార్ట్‌ఫోన్‌లు అరికడుతున్నాయి. ఏలా అంటారా? ఇండోనేషియాలోని ఓ స్వచ్ఛంద సంస్థ అక్రమ కలప రవాణాను అరికట్టేందుకు అడువుల్లో పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అమర్చింది. వీటికి ప్రత్యేకమైన సోలార్ ప్యానల్స్‌ను అమర్చటం ద్వారా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ ఫోన్‌లలో నిక్షప్తం చేసిన ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్, రంపం శబ్ధాలు వినగానే సంబంధిత అటవీశాఖను అప్రమత్తం చేస్తూ అలారమ్‌ను మోగిస్తుంది.

శాటిలైట్‌ మానిటరింగ్..

శాటిలైట్‌ మానిటరింగ్..

స్మార్ట్‌ఫోన్‌లు శాటిలైట్‌లకు శక్తిని సమకూరస్తున్నాయి. 

వెదర్ అప్‌డేట్స్

వెదర్ అప్‌డేట్స్

స్మార్ట్‌ఫోన్‌లు వాతావరణాన్ని అంచనా వేయగలుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా రెగ్యులర్ వెదర్ అప్‌డేట్‌లను పొందగలుగుతున్నాం...

Best Mobiles in India

English summary
These amazing things you never knew smartphone could do. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X