ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్‌‍ను అందుకోనున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

Posted By:

ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ పేరుతో కొత్త వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ ఇటీవల ప్రకటించింది. గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా కొత్త ఓఎస్ అప్‌డేట్‌తో అనేక స్మార్ట్‌ఫోన్ మోడళ్లు అందుబాటులోకి  రాబోతున్నాయి. ఆండ్రాయిడ్ నుంచి కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విడుదలైన నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు తన లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ అప్‌డేట్‌ను ప్రకటించనునున్నాయి. కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను అందుకోనున్న పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్‌‍ను అందుకోనున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

గూగుల్ ప్లే ఎడిషన్

గూగుల్ ప్లే ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ లాలీపప్ అప్‌డేట్ మరికొద్ది వారాల్లో అందనుంది. వాటి వివరాలు...గెలాక్సీ ఎస్ 4 జీపీఈ, ఎల్‌జీ జీ ప్యాడ్ 8.3 జీపీఈ, ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా జీపీఈ, హెచ్‌టీసీ వన్ ఎం8 జీపీఈ.

 

ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్‌‍ను అందుకోనున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

మోటరోలా

ఇటీవల విడుదలైన సెకండ్ జనరేషన్ మోటో ఎక్స్ , మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మొదటి వర్షన్ మోటో ఎక్స్ , మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లకు కూడా ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్ అందుతుందని మోటరోలా ఇటీవల ధృవీకరించింది. మరొవైపు, మోటో ఇ కూడా కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను అందుకోనుంది.

 

ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్‌‍ను అందుకోనున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

సామ్‌సంగ్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంగా శక్తివంతమైన బ్రాండ్‌గా అవతరించిన సామ్‌సంగ్ తన లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ అలానే ఫాబ్లెట్‌లకు ఆండ్రాయిడ్ లాలీపప్ అప్‌డేట్‌ను ప్రకటించనుంది. కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను అందుకోనున్న సామ్‌సంగ్ డివైజ్‌ల వివరాలు.. గెలాక్సీ నోట్ 4, గెలాక్సీ ఆల్ఫా, గెలాక్సీ ఎస్ 5, గెలాక్సీ ఎస్ 4, గెలాక్సీ ఎస్ 5 మినీ, గెలాక్సీ నోట్ ఎడ్జ్, గెలాక్సీ నోట్ 3.

 

ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్‌‍ను అందుకోనున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

సోనీ

సోనీ తన లేటెస్ట్ వర్షన్ ఎక్స్ పీరియా సిరీస్ డివైస్‌లకు లాలీపప్ అప్‌డేట్‌ను ప్రకటించింది. వాటి వివరాలు ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా జెడ్ఎల్, ఎక్స్‌పీరియా జెడ్ఆర్, ఎక్స్‌పీరియా టాబ్లెట్ జెడ్, ఎక్స్‌పీరియా జెడ్1, ఎక్స్‌పీరియా జెడ్1ఎస్,  ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా, ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్, సోనీ ఎక్స్‌పీరియా జెడ్3, ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్, ఎక్స్‌పీరియా జెడ్2 టాబ్లెట్, ఎక్స్‌పీరియా జెడ్3 టాబ్లెట్ కాంపాక్ట్ తదితర డివైస్‌లు ఆండ్రాయిడ్ లాలీపప్ అప్‌డేట్‌ను అందుకోనున్నాయి.

 

ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్‌‍ను అందుకోనున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

హెచ్‌టీసీ:

ఆండ్రాయిడ్ లాలీపప్ అప్‌డేట్‌ను అందుకోనున్న హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు.... హెచ్‌టీసీ వన్, హెచ్‌టీసీ వన్ ఎమ్8, హెచ్‌టీసీ వన్ మినీ, హెచ్‌టీసీ వన్ మినీ 2, హెచ్‌టీసీ డిజైర్ ఐ, హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఐ.

 

ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్‌‍ను అందుకోనున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఎల్‌జీ:

ఎల్‌జీ జీ3, ఎల్‌జీ జీ2 స్మార్ట్‌ఫోన్‌లకు త్వరలోనే ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్ అందనుంది.

 

ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్‌‍ను అందుకోనున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు

ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లైన మైక్రోమాక్స్ కాన్వాస్ ఏ1, కార్బన్ స్పార్కిల్ వీ, స్పైస్ డ్రీమ్ యునోలు త్వరలోనే ఆండ్రాయిడ్ లాలీపప్ అప్‌డేట్‌ను అందుకునే అవకాశం ఉంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
These devices are getting Android 5.0 Lollipop update. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot