నోకియా 9... మరో సంచలనం

ఎండబ్ల్యూసీ 2017 వేదికగా నోకియా నుంచి పెద్ద ఫోన్‌లు లాంచ్ అవుతాయని అందరూ భావించారు. అయితే, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ కేవలం నాన్ - ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే లాంచ్ చేసిన నోకియా, యాపిల్ ఐఫోన్ 8, గెలాక్సీ ఎస్8 వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పోటీగా భావిస్తోన్న హైఎండ్ ఫోన్‌లకు లాక్ చేసి ఉంచినట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో..

హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో హెచ్‌ఎం‌డి గ్లోబల్ అభివృద్ధి చేసిన నోకియా 8, నోకియా పీ1 వంటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా, నోకియా 9 పేరుతో ఓ కాన్సెప్ట్ ఫోన్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న ఈ కాన్సెప్ట్ మోడల్ వీడియో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

మెటల్ బాడీతో క్రాఫ్టింగ్

కాన్సెప్ట్ రెండర్ నో కియా 9 కాన్సెప్ట్ ఫోన్‌ను మెటల్ బాడీతో క్రాఫ్ట్ చేసారు. స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబి ర్యామ్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిచారు.

కెమెరా విషయానికి వచ్చేసరికి...

కెమెరా విషయానికి వచ్చేసరికి నోకియా 9 కాన్సెప్ట్ ఫోన్ 41 మెగా పిక్సల్ ప్యూర్‌వ్యూ కెమెరా సెన్సార్ సపోర్ట్‌తో వస్తోంది.

ఆండ్రాయిడ్ నౌగట్ ఫోన్...

ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 64జీబి - 128జీబి స్టోరేజ్ కెపాసిటీ, 3,650mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కూడా ఈ కాన్సెప్ట్ డివైస్ కలిగి ఉంది.

నోకియా 9 కాన్సెప్ట్ వీడియో

నోకియా 9 కాన్సెప్ట్ వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These Nokia 9 concept images can make you dribble. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot