మార్కెట్లో, ఇటీవల భారీగా ధరలు తగ్గిన స్మార్ట్ ఫోన్లు! లిస్ట్, కొత్త ధరలు
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మీకు ఇప్పుడు సరైన సమయం కావచ్చు. ఎందుకంటే వన్ ప్లస్, షియోమీ & మోటోరోలా బ్రాండ్ల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న 5 మధ్య-శ్రేణి ఫోన్‌లపై భారీ తగ్గింపు ఆఫర్లు ప్రకటించారు.

ఈ ఫోన్లపై ధర తగ్గింపు అంటే రూ.500 లేదా రూ.1000 ధర తగ్గింపు అని అనుకోకండి. ఈ అన్నీ నిరాడంబరమైన మోడళ్ల ధరలకు రూ.3,000 - రూ.10,000 వరకు ధర తగ్గింపు పొందాయి. ఈ ఫోన్ల యొక్క కొత్త ధరలు మరియు వాటి ఆఫర్లు ఇంకా ముఖ్యమైన స్పెసిఫికేషన్ల వివరాలను ఇక్కడ గమనించవచ్చు.

వన్ ప్లస్ 10R:
గత సంవత్సరం లాంచ్ చేయబడిన వన్ ప్లస్ 10R, ఇటీవల 2వ సారి ధర తగ్గింపును పొందింది. గతేడాది రూ.4,000 ధర తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరో రూ.3,000 ధర తగ్గింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రూ. 31,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. వన్ ప్లస్ 10R స్మార్ట్‌ఫోన్ యొక్క వేరియంట్ ల వారీగా ధరలు చూస్తే, 8GB + 128GB (80W) ఎంపిక ధర రూ. 31,999 . 12GB + 256GB (80W) మరియు 12GB + 256GB (150W) ఇతర 2 నిల్వ ఎంపికలపై కూడా తగ్గింపు ఆఫర్ ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 35,999 మరియు రూ. 36,999 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

షియోమీ 12 ప్రో:
ఈ ఫొన్ గత సంవత్సరం లాంచ్ చేయబడింది. షియోమీ 12 ప్రో మొత్తం 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది.ఈ రెండూ వేరియంట్ లపై కూడా రూ. 10,000 ధర తగ్గింపు ఆఫర్ ఉంది. ప్రస్తుతం, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క 8GB RAM వేరియంట్ ధర రూ.52,999 కి మరియు 12GB RAM వేరియంట్ ధర రూ.54,999 కి అందుబాటులో ఉంది.

షియోమీ 11 లైట్ NE 5G:
ఈ ఫొన్ గత సెప్టెంబర్ 2021లో లాంచ్ చేయబడింది. ప్రస్తుతం షియోమీ 11 లైట్ NE 5G ఫోన్ పై ధర రూ.3,000 తగ్గింపు ప్రకటించబడింది. ఇది 2 స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది. ప్రస్తుతం 6జీబీ ర్యామ్ ఆప్షన్ ధర రూ.26,999కి మరియు 8జీబీ ర్యామ్ ఆప్షన్ ధర రూ.28,999కి అందుబాటులో ఉంది.

మోటో ఎడ్జ్ 30:
మోటో ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం 6GB + 128GB మరియు 8GB + 128GB ఆప్షన్లలో,ధర రూ. 27,999 మరియు రూ. 29,999 తో లాంచ్ చేయబడింది. అయితే ఇప్పుడు ఈ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లపై రూ.3000 ధర తగ్గింపు ఆఫర్ ను ప్రకటించారు. ఈ ధర తగ్గింపు తర్వాత, 6GB RAM మోడల్ రూ. 24,999 కి మరియు 8GB RAM మోడల్ రూ. 26,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

మోటో G72:
ఈ ఫోన్ గత సంవత్సరం అక్టోబర్‌లో లాంచ్ చేయబడింది. ఈ మోటోరోలా 108MP కెమెరా ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.18,999. అయితే తాజాగా దీనిపై రూ.3,000 ధర తగ్గింపును ప్రకటించారు. ప్రస్తుతం, ఇది రూ.15,999 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








