Home
Mobile

ఈ ఫోన్లపై ధరలు పెరిగాయి ,పెరిగిన ధరలు ఇవే !

By Maheswara

స్మార్ట్ఫోన్ తయారీదారులకు తమ ఉత్పత్తులను లాంచ్ చేయడానికి భారతదేశం ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. మన దేశంలో ఎక్కువ మంది వినియోగదారులు బడ్జెట్ ఆధారిత ఫోన్లు వాడే వారు కాబట్టి, కంపెనీలు తక్కువ ధరతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. అయితే, సవరించిన కొత్త జీఎస్టీ రేట్లు ఈ ఏడాది అమల్లోకి రావడంతో, స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు తమ ఉత్పత్తుల ధరలను పెంచడం కంటే వేరే మార్గం లేదు.

ప్రసిద్ధ ఫోన్ల  ధర

శామ్సంగ్, రియల్ మీ  మరియు మోటరోలా వంటి అనేక బ్రాండ్లు తమ ప్రసిద్ధ ఫోన్ల  ధరలను పెంచాయి. శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 మరియు గెలాక్సీ ఎం 31 లకు ధరల ను పెంచింది , ఈ రెండూ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు. వీటితో పాటు ధరలు  పెరిగిన ఫోన్ల వివరాలు చూద్దాం రండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M 21 

శామ్‌సంగ్ గెలాక్సీ M 21 

పాత ధర: Rs. 13,999
కొత్త ధర: Rs. 14,499
శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్పెసిఫికేషన్స్
 6.4-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లే 1080x2340 పిక్సెల్స్ పరిమాణంలో ఉండి ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 19.5: 9 కారక నిష్పత్తితో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. M 21 స్మార్ట్ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ -అప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ ఫోటోలను తీయడానికి మరియు వీడియోలను రికార్డ్ చేయడానికి సెటప్ చేయబడి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం దీని ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లతో పనిచేస్తుంది.4 G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా వస్తుంది. ఫోన్‌లోని ఇతర సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరో, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 6,000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Galaxy M31

Galaxy M31

పాత ధర: Rs. 16,999
కొత్త ధర: Rs. 17,999
6.4-అంగుళాల (2340 x 1080 పిక్సెల్స్) పూర్తి HD + ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఆక్టా-కోర్ (క్వాడ్ 2.3GHz + క్వాడ్ 1.7GHz) మాలి-జి 72 , 6 జిబి  ర్యామ్‌తో 64 జిబి / 128 జిబి నిల్వతో, ఎక్సినోస్ 9611 10 ఎన్ఎమ్ ప్రాసెసర్ తో  వన్ UI 2.0 మీద పనిచేస్తుంది.  డ్యూయల్ సిమ్ (నానో + నానో / మైక్రో SD) సెటప్ కలిగి ఉంది .  64MP వెనుక కెమెరా మరియు 32MP ముందు కెమెరా ఉన్నాయి వీటితో పాటు  8MP + 5MP + 5MP వెనుక కెమెరాలు కూడా ఉన్నాయి. డ్యూయల్ 4G VoLTE ను సపోర్ట్ చేస్తుంది.ఇది 6000mAh బ్యాటరీతో వస్తుంది .ఇందులో మైక్రో SD కార్డ్ ఆండ్రాయిడ్ 10 ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు.

Moto G8 Power Lite

Moto G8 Power Lite

పాత ధర: Rs. 8,999
కొత్త ధర: Rs. 9,499
 Moto G8 Power Lite  స్పెసిఫికేషన్స్
6.5-ఇంచ్ (1600×720 పిక్సల్స్) HD+ 20:9  తో LCD స్క్రీన్, మాక్స్ విజన్ ప్యానల్‌ను కలిగి ఉంది.అలాగే ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో మరియు 5,000mah బ్యాటరీతో వస్తోంది. 4GB ర్యామ్ తో పాటు స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో వస్తుంది.

Realme Narzo 10A

Realme Narzo 10A

పాత ధర: Rs. 8,499
కొత్త ధర: Rs. 8,999  
రియల్‌మి నార్జో 10A స్పెసిఫికేషన్స్
రియల్‌మి 10A స్మార్ట్ ఫోన్ యొక్క 6.5-అంగుళాల డిస్ప్లే హెచ్‌డి + రిజల్యూషన్ తో 720x1600 పిక్సెల్స్ పరిమాణంతో మరియు 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది.ఇక కెమెరాల విషయానికి వస్తే ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో f / 1.8 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా 119 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి.3GB ర్యామ్,32GB మెమరీ మరియు 5000mah బ్యాటరీ కలిగి ఉంటుంది   

Realme C3

Realme C3

పాత ధర: Rs. 7,999
కొత్త ధర: Rs. 8,999    
రియల్‌మి C3 స్మార్ట్‌ఫోన్‌ 20: 9 కారక నిష్పత్తితో మరియు 89.8 శాతం స్క్రీన్-బాడీ-రేషియో గల 6.5-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది.ఇది మీడియాటెక్ హెలియో G70 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది.ఇంటర్నల్ స్టోరేజ్ 64GB మరియు మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి వీలుకల్పిస్తుంది.కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది. అలాగే పోర్ట్రెయిట్‌ల మోడ్ కోసం 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి.ఈ ‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీతో ఉండి ,ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది.  

Best Mobiles in India

English summary
These Smartphones Prices Got Increased Recently ,check new prices here  
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X