ఇవి చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో కొత్త మొబైల్ కొనవద్దు

|

ఒకప్పుడు ఎవరైనా మొబైల్ కొనాలంటే ఆలోచించే అంశాల్లో ముఖ్యమైనవి ధర, ఏ కంపెనీ. అయితే రాను రాను స్మార్ట్ ఫోన్ విప్లవం పుంజుకున్న తరువాత ఫోన్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మార్కెట్లో తక్కువ ధరలో అనేక రకాలైన ఫీచర్లతో కంపెనీలు తమ ఫోన్లను విడుదల చేస్తున్నా. దీంతో వినియోగదారుల్లో కాస్త అయోమయం నెలకొంది. ఈ ఫోన్ కొంటే ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. అందులో ఫీచర్లు ఏంటి.. దాని పనితీరు ఎలా ఉంటుంది ఇలా రివ్యూలు చూసి అందరూ కొంటుంటారు. ఇందులో భాగంగా గిజ్‌బాట్ తెలుగు ప్రత్యేక శీర్షికలో భాగంగా పోన్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తోంది. మీరు ఫోన్ కొనుగోలు సమయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవడం మరచిపోకండి.

 

యూజర్లకి అదిరిపోయే శుభవార్తను అందించిన ఎయిర్‌టెల్యూజర్లకి అదిరిపోయే శుభవార్తను అందించిన ఎయిర్‌టెల్

ప్రాసెసర్‌ హర్ట్ లాంటిది

ప్రాసెసర్‌ హర్ట్ లాంటిది

మీరు ఏ మొబైల్ కొన్నా అందులో ప్రాసెసర్ అనేది చాలా కీలకమైంది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటం, స్ట్రీమింగ్‌ వీడియోలు, ఆన్‌లైన్‌లో వీడియోలు, ఫొటోల మీద మోజు ఉన్నవారు క్వాల్‌కోమ్‌ స్నాప్‌‌డ్రాగన్‌ 652 ప్రాసెసర్‌ మొబైల్స్ కొనడం ఉత్తమం. ఇంకాహై ఎండ్ కావాలనుకున్న వారు స్నాప్‌‌డ్రాగన్‌ 820/821 ప్రాసెసర్‌ బాగా సెట్ అవుతుంది. సాధారణ యూజర్లు మీడియాటెక్ ప్రాసెసర్‌ మీద ఇంట్రెస్ట్ చూపవచ్చు.

 ఫోన్ ని కాపాడేది బ్యాటరీనే

ఫోన్ ని కాపాడేది బ్యాటరీనే

మీరు ఫోన్ దేనికొరకు ఉపయోగిస్తున్నారో తెలుసుకుని తదనుగుణంగా బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్లను కొనుగోలు చేయడం ఉత్తమం. మినిమం 3000 ఎంఏహెచ్‌ నుంచి 3500ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండేలా చూసుకోండి.

ప్యానల్
 

ప్యానల్

మార్కెట్లో ఇప్పుడు గ్లాస్‌ కోటెడ్‌ ప్యానల్స్‌ , మెటల్‌ బాడీ ప్యానల్స్ లభిస్తున్నాయి. వీటిల్లో మీరు ఉపయోగించే విధానాన్ని బట్టి సెలక్ట్ చేసుకోండి. రఫ్ అండ్ టఫ్ యూజర్లకు స్టిక్‌ లేదా మెటల్‌ బాడీ‌ బాగా సూట్ అవుతుంది. సున్నితంగా వాడేవారికి గ్లాస్‌కోటెడ్‌ సెట్ అవుతుంది.

డిస్‌ప్లే

డిస్‌ప్లే

ఇది చాలా కీలకం. మీరు వాడే విధానాన్ని బట్టి దీన్ని సెలక్ట్ చేసుకోవాలి. మార్కెట్లో 5 నుంచి 6 అంగుళాల తాకేతెరలు ఇప్పుడు లభిస్తున్నాయి. వీడియోలు, ఫోటోస్‌ను ఎడిట్‌ చేయాలనుకున్న వారు 6 అంగుళాల డిస్‌ప్లే వైపు వెళ్లడం మంచిది. నార్మల్ యూజర్లు 5 లేదా 5.5 అంగుళాల డిస్‌ప్లే వైపు వెళ్లడం ఉత్తమం.

కెమెరా

కెమెరా

ఫొటోగ్రఫీ అంటే ఇష్టముంటే 12 ఎంపీ లేదా 16 ఎంపీ కెమెరా సామర్థ్యం ఉన్న మొబైల్స్‌ ఎంచుకోవడం ఉత్తమం. సాధారణ వినియోగదారులకు 8ఎంపీ లేదా 12 ఎంపీతో ఫోన్ తీసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా రెజెల్యూషన్‌, కెమెరా అపెట్యూర్‌, ఐఎస్‌ఓ లెవెల్‌, పిక్సెల్‌ పరిమాణం, ఆటోఫోకస్‌ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోండి.

స్టోరేజ్

స్టోరేజ్

యాప్స్ మీద ఈ స్టోరేజ్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ యాప్స్ యూజ్ చేయాలనుకున్న వారు ఎక్కువ జిబి ఉండే మొబైల్స్ ని తీసుకోవచ్చు. నార్మల్ యూజర్లు తక్కువ వైపు ఆసక్తి చూపవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే విస్తరణ సామర్థ్యం ఉంటాయి కాబట్టి వాటిని పెంచుకునే విధంగా మీరు మొబైల్ సెలక్ట్ చేసేకుంటే సరిపోతుంది.

సెక్యూరిటీ:

సెక్యూరిటీ:

ఇప్పుడు రకరకాల సెక్యూరిటీ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఐరిస్‌, ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ అన్‌లాక్‌ లాంటి ఆప్షన్ల ద్వారా ఫోన్‌ను‌ అన్‌లాక్‌ చేయడం సాధ్యపడుతోంది. కేవలం వీటికోసమే కాకుండా ముఖ్యమైన డాక్యుమెంట్లకు, వీడియోలకు, యాప్స్‌కు సెక్యూరిటీ కల్పించడానికి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అందువల్ల వీలైనంత వరకు లేటెస్ట్‌ సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన మొబైల్స్‌నే తీసుకోవడం ఉత్తమం.

ఆడియో ఫీచర్‌

ఆడియో ఫీచర్‌

మీరు ఆడియో ప్రియులైతే స్పీకర్లు, సౌండ్‌ క్వాలిటీని చూసుకోవాల్సి ఉంటుంది. వీడియో స్ట్రీమింగ్‌ ద్వారా ఎక్కువగా మాట్లాడేవారు ఫోన్‌కు ముందువైపు స్పీకర్లు ఉన్న మొబైల్స్‌ ఎంచుకోవడం మంచింది. సాధారణ వినియోగదారులు వెనకవైపున స్పీకర్లను తీసుకోవచ్చు.

 యూఎస్‌బీ పోర్టు

యూఎస్‌బీ పోర్టు

ప్రస్తుతం మైక్రో యూఎస్‌బీ, యూఎస్‌బీ-సీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూఎప్‌బీ -సీ కేబుళ్లను ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే భవిష్యత్‌లో వీటినే ఎక్కువగా వినియోగించే అవకాశాలున్నాయి. రెండు సంవత్సరాల క్రితం సాధారణంగా 3.5మి.మీ హెడ్‌ఫోన్‌ జాక్‌లను ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. హెడ్‌సెట్‌లలో కూడా చాలా వరకు యూఎస్‌బీ-సీ రకం కేబుళ్లనే వాడుతున్నారు.

Best Mobiles in India

English summary
Buying a new smartphone? Here are 10 things to consider More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X