మీ కొత్త ఫోన్‌కు కొన్ని టిప్స్

మార్కెట్లో ఎవరి దగ్గర చూసినా ఆండ్రాయిడ్ ఫోన్‌లే కనిపిస్తున్నాయి. తక్కువ ధర. సౌకర్యవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్, అందుబాటులో లెక్కకు మిక్కిలి యాప్స్ వెరిసి ఆండ్రాయిడ్ ఫోన్‌లను అద్భుత స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాలుగా మార్చేసాయి. కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు తమ ఫోన్‌లో ఈ మార్పులు చేసినట్లయితే పనితీరు ఇంకా బాగుంటుంది...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి

ముందుగా ఫోన్ స్ర్కీన్‌ను మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి. అవసరమైన విడ్జెట్‌లు, నచ్చిన స్ర్కీన్ సేవర్లతో ఫోన్ హోమ్ స్ర్కీన్‌‍ను అందంగా ఉంచుకోండి. అవసరంలేని విడ్జెట్ లను ఫోన్ హోమ్ స్ర్కీన్ నుంచి రిమూవ్ చేయండి.

వాటిని uninstall లేదా disable చేసేయండి.

ఫోన్‌తో ఇన్‌బిల్ట్‌గా వచ్చే యాప్స్‌లో కొన్నింటి వల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉండవు. ఇలాంటి యాప్స్ ఏమైనా మీ ఫోన్‌లో ఉన్నట్లయితే uninstall లేదా disable చేసేయండి.

‌బ్లోట్‌వేర్‌ ను తొలగించండి...

తయారీదారు‌లు ఇన్‌బుల్ట్‌గా కొన్ని సాఫ్ట్‌వేర్‌లను ఫోన్‌లతో పాటు అందిస్తుంటారు. వీటిలో కొన్ని సాఫ్ట్‌వేర్‌లు నిరుపయోగంగా మారి ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించేస్తాయి. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లనే బ్లోట్‌వేర్‌ అని పిలుస్తారు. బ్లోట్‌వేర్‌ను తొలగించటం ద్వారా పోన్ స్టోరేజ్ స్పేస్ మరింత ఖాళీ అవుతుంది.

‘Auto Update Apps'

మీ కొత్త ఫోన్ వైరస్‌ల బారిన పడకుండా ఉండాలంటే, మీరు డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్ అన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసుకున్నవే అయి ఉండాలి. అంతేకాకుండా ఈ యాప్‌లను ఎప్పటికప్పడు అప్‌డేట్ అవుతుండాలి. గూగుల్ ప్లే యాప్ సెట్టింగ్స్‌‌లోకి వెళ్లి ‘Auto Update Apps' ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా యాప్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయిపోతుంటాయి.

Google Now వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌

Google Now వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను వాడటం మొదలు పెట్టండి. ఈ ఫీచర్‌‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఎంచక్కా మాటలతోనే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. మీరిచ్చే స్పెసిఫిక్ కమాండ్‌లను పూర్తిగా అర్థం చేసుకుని గూగుల్ నౌ ఆ పనులను చక్కబెడుతుంది. ఈ ఫీచర్ ద్వారా వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు, సమీపంలోని రెస్టారెంట్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

అటువంటి యాప్స్ జోలికి వెళ్లకండి..

బ్యాటరీ బ్యాకప్ పెంచుదామంటూ బ్యాటరీ బూస్టర్ యాప్స్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకండి. ఇలా చేయటం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యే ప్రమాదముంది.

అన్‌సెక్యూర్‌గా వదిలిపెట్టేయకండి

మీ కొత్త ఫోన్‌ను అన్‌సెక్యూర్‌గా వదిలిపెట్టేయకండి. వేరొకరు మీ ఫోన్ ను ఉఫయోగించకుండా పటిష్టమైన పాస్‌వర్డ్‌ లేదా లాక్‌ను సెట్ చేసుకోండి.

రూట్ చేయించకండి..

మీ కొత్త ఫోన్‌ను రూట్ చేయటం వంటివి చేయకండి. ఇలా చేయటం వల్ల కంపెనీ నుంచి ఏ విధమైన ఫిర్మ్‌వేర్ అప్‌డేట్స్ మీకు అందవు.

ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్‌ను సెటప్ చేసుకోవటం ద్వారా..

గూగుల్ సెట్టింగ్స్‌లోని ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్‌ను సెటప్ చేసుకోవటం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను లొకేట్ లేదా లాక్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Things To Do Immediately After Buying New Android Phone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot