డ్యుయల్ సిమ్ ఫోన్ వాడుతున్నారా..?

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలోనూ కనిపిస్తోంది. వినియోగంలో ఎన్న రెండు సిమ్‌లలో ఒక సిమ్‌ను డేటా కోసం మరొక సిమ్‌ను కాల్స్ కోసం ఉపయోగించటం జరుగుతోంది. దాదాపుగా చాలా మంది ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సింగిల్ సిమ్ ఫోన్‌లతో పోలిస్తే డ్యుయల్ సిమ్ ఫోన్‌లు చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. 

Read More : రూ.74తో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 5జీబి డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రేడియేషన్ స్థాయి ఎక్కువుగా..

డ్యూయెల్ సిమ్ వల్ల రేడియేషన్ లెవల్స్ ఎక్కువై ఒత్తిడి పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సింగిల్ సిమ్ ఫోన్‌లతో పోలిస్తే..

డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ సెల్‌ఫోన్ టవర్స్‌తో కమ్యూనికేషన్ అయ్యే సమయంలో రేడియో ప్రీక్వెన్సీ రేడియేషన్ భారీస్థాయిలో వెలువడుతుంది. ఇది సింగిల్ సిమ్ ఫోన్‌లో చాలా తక్కువగా ఉంటుంది.

అనేక రోగాలు చుట్టుముట్టే ప్రమాదం..

ఫోన్ సిగ్నల్స్ ద్వారా వెలువడే రేడియేషన్ వల్ల మనిషిని అనేక రోగాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా వీర్యకణాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక నిద్రలో పక్కన పెట్టుకోవడం వల్ల కూడా రేడీయేషన్ దెబ్బకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రేడియేషన్ వెలువడుతూనే ఉంటుంది

మీరు ఫోన్ మాట్లాడుతున్నా లేకుంటే పక్కన పెట్టినా రేడియేషన్ అనేది వెలువడుతూనే ఉంటుంది. ఆ రేడియేషన్ 40 నుంచి 80 శాతం వరకు డ్యూయెల్ సిమ్ ఫోన్ల నుంచి వెలువడుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవటం ఉత్తమం..

డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే ముందకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవటం ఉత్తమం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Think before Purchasing Dual Sim Mobile : Health Dangers. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot