క్లాసికల్ కార్బన్ ఫోన్ జస్ట్ ఫర్ 3,990!!

Posted By: Prashanth

క్లాసికల్ కార్బన్ ఫోన్ జస్ట్ ఫర్ 3,990!!

 

చవక ధర డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మధ్య తరగతి మొబైల్ బ్రాండ్ కార్బన్ కె1414 మోడల్‌లో ఓ ఫీచర్ ఫిల్ట్ ఫోన్‌ను డిజైన్ చేసింది. ధర రూ.3990. మన్నికైన బ్యాటరీ బ్యాకప్, ఆకట్టుకునే మల్టీ మీడియా వ్యవస్ధ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హ్యాండ్‌సెట్ ద్వారా సౌకర్యవంతమైన స్మార్ట్ మొబైల్ కంప్యూటింగ్‌ను పొందవచ్చు.

ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:

. డ్యూయల్ సిమ్ సపోర్ట్,

. జీఎస్ఎమ్ నెట్‌వర్క్,

. 3.2 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

. 16జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ,

. బ్లూటూత్ కనెక్టువిటీ,

. 3 మెగా పిక్సల్ కమెరా,

. ఉత్తమ క్వాలిటీ ఆడియో, వీడియో ప్లేయర్,

. ఎఫ్ఎమ్ రేడియో,

. టచ్ కీప్యాడ్.

మరో డ్యూయల్ సిమ్ ఫోన్ ‘కార్బన్ మల్టీప్లెక్స్’ ప్రత్యేకతలు:

మొబైల్ బరువు 111గ్రాములు. మొబైల్ చుట్టుకొలతలు 116 x 62.5 x 10.9 mm. 3.5 ఇంచ్ HVGA టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉంది. 3 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు 320 x 480 ఫిక్సల్ రిజల్యూషన్ దీని సొంతం. మార్కెట్లో లభించే అన్ని రకాల మల్టీమీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. 3GP, MP4, AVI ఫార్మెట్లలలో వీడియో, ఆడియో సాంగ్స్‌ని ప్లే చేస్తుంది.

పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో Li-Ion 1100 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. టాక్ టైమ్ 6గంటలు. స్టాండ్ బై టైమ్ 240 గంటలు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 1 GB + 256 MB మెమరీ లభిస్తుంది. మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమరీని 16జిబి వరకు విస్తరించుకోవచ్చు. ఎంటర్టెన్మెంట్ కోసం ఇందులో ఎఫ్ ఎమ్ రేడియో, ఎమ్‌పి3 ప్లేయర్‌లను నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు కింగ్ మూవీ ప్లేయర్ ప్రత్యేకం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot