Home
Mobile

18,000mAh బ్యాటరీతో వస్తున్న ఫోన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్యావసరంగా మారిపోయింది.పొద్దున లేచిన దగ్గర్నించి సాయంత్రం పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టుకుని దాంతోనే కాలక్షేపం చేస్తుంటారు.

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్యావసరంగా మారిపోయింది.పొద్దున లేచిన దగ్గర్నించి సాయంత్రం పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టుకుని దాంతోనే కాలక్షేపం చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా వచ్చిన తరువాత అయితే ఈ వాడకం మరింతగా పెరిగిపోయింది. అయితే ఈ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ఫోన్ బ్యాటరీ ఓ గంట కూడా రావడం లేదు. అందువల్ల అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్ల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం మార్కెట్లోకి కొత్తగా 18,000mAh battery ఫోన్ వస్తోంది. దీనిపై ఓ లుక్కేయండి.

Energizer న్యూ ఫోన్

Energizer న్యూ ఫోన్

యూజర్లు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్లను ఇష్టపడుతున్న తరుణంలో Energizer అనే సంస్థ కూడా భారీ బ్యాటరీతో సరికొత్త ఫోన్ ని మార్కెట్లోకి తీసుకురానుంది. లేటెస్ట్ గా వచ్చిన రిపోర్టుల ప్రకారం భారీ కెపాసిటి కలిగిన బ్యాటరీతో కూడిన ఫోన్ ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ప్రత్యేకంగా పాపప్ కెమెరా

ప్రత్యేకంగా పాపప్ కెమెరా

ఇటీవల కాలంలో చాలా స్మార్ట్ ఫోన్లలో popup కెమెరాలు లభిస్తున్న నేపథ్యంలో ఈ ఫోన్లో కూడా ప్రత్యేకంగా పాపప్ కెమెరాను పొందుపరిచారు. ఈ కెమెరా ద్వారా అదిరిపోయే ఫోటోలను తీసుకోవచ్చు.ఫోన్ ముందు భాగంలో 16 మరియు 2 మెగాపిక్సల్ కలిగిన రెండు కెమెరాలు, వెనుక భాగంలో, 12, 5 మరియు 2 మెగా పిక్సల్ రిజల్యూషన్ కలిగిన మరో రెండు కెమెరాలు ఉంటాయి. 4K క్వాలిటీ కలిగిన వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

Energizer Power Max P18K POP

Energizer Power Max P18K POP

కాగా కంపెనీ Energizer Power Max P18K POP పేరుతో ఫోన్ ని తీసుకొస్తోంది. ఇందులో 6.2 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్డిస్ప్లే,మీడియా టెక్ P70 ప్రాసెసర్,6 జీబీ ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. మెమరీ కార్డు ద్వారా అదనంగా మరో 128జీబి స్టోరేజ్ పొందొచ్చు.

హైలెట్ బ్యాటరీనే

హైలెట్ బ్యాటరీనే

ఈ ఫోన్ బ్యాటరీని తీసుకుంటే, దీని సాయంతో నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా పాటలు వినొచ్చు. ఒక క్షణం కూడా ఆగకుండా 2 రోజుల పాటు వీడియోలు చూడొచ్చు. 50 రోజులపాటు ఫోన్ స్టాండ్-బై లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఫోన్ వేగంగా ఛార్జింగ్ పూర్తవడం కోసం 18W కెపాసిటీ కలిగిన ఫాస్ట్ ఛార్జర్ ని పొందుపరిచారు.

అదనపు ఫీచర్లు

అదనపు ఫీచర్లు

USB Type -C పోర్ట్‌ని కలిగి ఉండే ఈ ఫోన్లో, Android 9.0 Pie ఆపరేటింగ్ సిస్టం పొందుపరచబడి ఉంటుంది. కాగా అన్నీ కుదిరితే జూన్ లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ధర వివరాలు తర్వాత తెలిసే అవకాశం ఉంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
This is the 18,000mAh battery phone you probably didn’t ask for More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X