సస్పెన్స్ రేపుతోన్న నోకియా 3310, ఏమిటా కొత్త ఫీచర్..?

నోకియా 3310 మోడల్ మళ్లీ మార్కెట్లోకి వస్తోందనగానే ఒక్కసారిగా మొబైల్ మార్కెట్లో ఆసక్తికర వాతావరణం నెలకుంది. 2000 సంవత్సరంలో మార్కెట్లో విడుదలైన అమ్మకాల సునామీని సృష్టించిన ఈ ఐకానిక్ మోడల్ ఫోన్‌ను మరోసారి మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు నోకియా సిద్దమైంది.

నోకియా కొత్త ఫోన్‌ల లాంచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌ఎండీ గ్లోబల్ నేతృత్వంలో

ఈ నెల 26న బార్సిలోనాలో నిర్వహిస్తోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రీ-లాంచ్ ఈవెంట్‌లో భాగంగా హెచ్‌ఎండీ గ్లోబల్ నేతృత్వంలోని నోకియా పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లతో పాటు ఐకానిక్ నోకియా 3310 ఫోన్‌ను కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

వాట్సాప్ పుట్టింది ఈ రోజే, మీకు తెలియని నిజాలు

స్వల్ప మార్పుచేర్పులతో

అప్పటి మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్చుచేర్పులతో రాబోతోన్న ఈ ఫోన్ కు హైపర్ రిసెస్టింగ్ హౌసింగ్ ప్రధాన ఆకర్షణ కానుందట. ఈ ఫీచర్ ఫోన్ ను మరింత శక్తివంతంగా ర్చేస్తోందట. ఫీచర్ ఫోన్‌గానే మార్కెట్లోకి రాబోతోన్న నోకియా 3310కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు..

ఇది ఒక ఫీచర్ ఫోన్ మాత్రమే

నోకియా 3310 స్మార్ట్‌ఫోన్ కాదు, ఇది ఒక ఫీచర్ ఫోన్ మాత్రమే. గతంలో వచ్చిన మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్పుచేర్పులు ఈ ఫోన్‌లో ఉంటాయి. పాత వర్షన్ నోకియా 3310, 84 x 84పిక్సల్ రిస్యలూషన్ తో కూడిన మోనోక్రోమ్ స్ర్కీన్ ను కలిగి ఉండేది. తాజాగా తీసుకువస్తోన్న కొత్త వర్షన్ 3310 మోడల్ ఇంకాస్త పెద్ద కలర్ డిస్‌ప్లేను కలిగి ఉండనుంది.

కలకలం రేపుతోన్న ఐఫోన్ 7 ప్లస్ పేలుడు

రెడ్, గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ వేరియంట్‌లలో

పాత వర్షన్ నోకియా 3310 గ్రే, బ్లాక్ ఇంకా యాఫ్ బ్లూ కలర్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు.. రెడ్, గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ వేరియంట్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి 26న బార్సిలోనాలో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్‌ను మే,2017 కంటే ముందే ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేస్తారట. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.4,000లోపు ఉండొచ్చట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This New Feature Of Iconic Nokia 3310 Will Shock You. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting