5,000mAh బ్యాట‌రీతో OPPO A57e బ‌డ్జెట్ మొబైల్ విడుద‌ల‌! ధ‌ర ఎంతంటే!

|

OPPO కంపెనీ భార‌త‌దేశంలో యూజ‌ర్లను ఆక‌ట్టుకునేందుకు కొత్త డివైజ్‌ల‌ను క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా, ఆ కంపెనీ భారత మార్కెట్లో కొత్త A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. OPPO A57e పేరుతో రూ.15,000 లోపు బ‌డ్జెట్ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త Oppo స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన A57 మాదిరిగానే ఉంటుంది. A57 మరియు A57e రెండు మొబైల్స్‌ కూడా భారతదేశంలో ఒకే ధరలో ఉన్నాయి.

OPPO A57e

Oppo A57e డివైజ్ క‌ర్వ్‌డ్ కార్న‌ర్స్‌తో ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ముందు కెమెరా కోసం డిస్ప్లే పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది. Oppo A57e ఫోన్ MediaTek ప్రాసెసర్‌తో లాంచ్ చేయ‌బ‌డింది. కాగా, ఇప్పుడు భార‌త మార్కెట్లో OPPO A57e ధరలు, ఫీచర్లను పూర్తిగా తెలుసుకుందాం.

భారతదేశంలో Oppo A57e ధర మరియు క‌ల‌ర్ వేరియంట్లు:
OPPO కంపెనీ A57eని కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌గా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒకే స్టోరేజీ ఎంపికతో ప్రారంభించబడింది. ఇది 4GB RAM మరియు 64GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీని అందిస్తుంది. దీన్ని మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 1TB వరకు విస్తరించవచ్చు. దీని ధర ను రూ.13,999 గా నిర్ణ‌యించింది. A57e 4G ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. వినియోగదారులు ఫోన్‌ని గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి ఎంచుకోవచ్చు.

OPPO A57e

Oppo A57e స్పెసిఫికేష‌న్లు:
OPPO A57e డిజైన్ మ‌రియు ప‌లు ఫీచ‌ర్ల ప‌రంగా దాదాపు OPPO A57s మాదిరిగానే ఉంటుంది. ఇది HD+ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను క‌లిగి ఉంటుంది. 600 nits బ్రైట్‌నెస్ మరియు 269 PPI పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఇది ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. మరియు దీని డిస్‌ప్లే పాండా గ్లాస్ ప్రొటెక్ష‌న్ క‌లిగి ఉంటుంది.

OPPO A57e

Oppo A57e ఫోన్‌ను వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ను అందిస్తున్నారు. ఫోన్‌లో 13MP ప్రధాన కెమెరా మరియు 2MP మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో LED ఫ్లాష్ మాడ్యూల్ కూడా ఉంది. సెల్ఫీ కోసం ఫ్రంట్ సైడ్ 8MP క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. చివరగా, ఫోన్ Android 12-ఆధారిత ColorOS 12.1 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో ర‌న్ అవుతుంది.

ఇక ఛార్జ్ విష‌యానికొస్తే.. A57e 4G మొబైల్ 5000 mAh శ‌క్తివంత‌మైన‌ బ్యాటరీని కలిగి ఉంది. USB టైప్-సి పోర్ట్ ద్వారా ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్టుతో వ‌స్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీని అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ హీలియో G35 SoC చిప్‌సెట్‌ను క‌లిగి ఉంది.

అదేవిధంగా, భార‌త మార్కెట్లో ఇప్ప‌టికే విడుద‌లైన Oppo A57 మొబైల్ గురించి కూడా తెలుసుకుందాం:
Oppo A57 2022 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..
ఈ మొబైల్ కు 6.56 అంగుళాల ఫుల్ HD+ display అందిస్తున్నారు. ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డ‌స్ట్ రెసిస్టాన్స్‌ను క‌లిగి ఉంది. దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ను క‌లిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ ను అల్యూమినియం తో స్క్వేర్ షేప్‌లో రూపొందించారు. ఈ మొబైల్ ColorOS 12.1, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ octa-core MediaTek Helio G35 ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది.

OPPO A57e

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఇది 720x1612 pixels (HD+) రిసొల్యూష‌న్ క‌లిగి ఉంది. అంతేకాకుండా వైఫై, బ్లూటూత్ v5.00 ఫీచ‌ర్ క‌లిగి ఉంది. భార‌త మార్కెట్లో దీని ధ‌రను కంపెనీ రూ.13,999 గా నిర్ణ‌యించింది. ఈ హ్యాండ్‌సెట్లు కంపెనీ సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి గ్రీన్‌, బ్లాక్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
This superhit smartphone of OPPO launched in the budget segment with 5000mAh battery

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X