నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో మూడు కీలక మార్పులు

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే నోకియా 3, నోకియా 5, నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌‌లు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

|

హెచ్ఎండి గ్లోబల్ నేతృత్వంలో ఆండ్రాయిడ్ బాట పట్టిన నోకియా, ఎండబ్ల్యూసీ 2017 వేదికగా మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే.

Read More : ధన్ ధనా ధన్‌కి పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్

రూ.10,000 నుంచి రూ.20,000 బడ్జెట్ రేంజ్‌లో

రూ.10,000 నుంచి రూ.20,000 బడ్జెట్ రేంజ్‌లో

 నోకియా 3, నోకియా 5, నోకియా 6 మోడల్స్‌లో నోకియా లాంచ్ చేసిన ఫోన్‌లు రూ.10,000 నుంచి రూ.20,000 బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 

జూన్ నాటికి  ఇండియన్ మార్కెట్లో..

జూన్ నాటికి ఇండియన్ మార్కెట్లో..

ఇండియన్ మార్కెట్లో, ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లను జూన్ నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు కేవలం విండోస్, సింబియాన్ ఓఎస్‌లకు మాత్రమే పరిమితమైన నోకియా స్మార్ట్‌ఫోన్‌లు మొట్టమొదటి సారిగా మూడు కీలక మార్పులతో వస్తున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..

 

బిల్డ్ క్వాలిటీ, డిజైన్

బిల్డ్ క్వాలిటీ, డిజైన్

నోకియా ఫోన్‌‌లకు మొదటి నుంచి బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్ లాంగ్వేజ్ వెన్నుముకగా నిలుస్తూ వస్తోంది. నోకియా లాంచ్ చేసిన నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్‌లలోనూ మళ్లీ అదే రుజువైంది. Foxconn కంపెనీ నుంచి తయారీ కాబడిన నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా న్యూ లుక్‌తో కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైనింగ్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 యూజర్ ఎక్స్‌పీరియన్స్

యూజర్ ఎక్స్‌పీరియన్స్

అది సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం కావొచ్చు, విండోస్ ఆపరేటింగ్ సిస్టం కావొచ్చు. నోకియా మొన్నటి వరకు లాంచ్ చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తాజాగా, నోకియా లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లు లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్నాయి. కాబట్టి, యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అప్ టు డేట్ గానే ఉంటుంది.

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే నోకియా 3, నోకియా 5, నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌‌లు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఫోన్‌లలో కనిపించే క్లీన్ ఇంకా నీట్ యూజర్ ఇంటర్‌ఫేస్ గూగుల్ పిక్సల్ ఫోన్ తరహా అనుభూతులను చేరువ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Three basic pillars on which Nokia Android phones are built. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X