ముగ్గురు మొనగాళ్లు వస్తున్నారు... ఇక రచ్చ రచ్చే..

Posted By: Super

ముగ్గురు మొనగాళ్లు వస్తున్నారు... ఇక రచ్చ రచ్చే..

బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌‌ని రూపొందిచే రీసెర్చ్ ఇన్ మోషన్ ఎప్పుడు మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసినా ఒకే విధమైన పేర్లతో మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దీని వెనుక ఉన్న ముక్య ఉద్దేశ్యం ఏమిటంటే వివిధ కస్టమర్స్ యొక్క అభిరుచులకు తగ్గట్లుగా వారిని ఆకర్షించే భాగంలోనే ఇలా ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొత్తగా మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ కర్వీ సిరిస్‌కు సంబంధించి మూడు మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. వాటి పేర్లు వరుసగా బ్లాక్‌బెర్రీ కర్వ్ 9350, 9360, 9370. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ మూడు మోడల్స్ యొక్క బరువు 99 గ్రాములు ఉండడమే.

మూడు మోడల్స్ కూడా బేసిక్ డిజైన్‌తో పాటు 109 X 60 X 11 mmగా చుట్టుకొలతను కలిగి ఉన్నాయి. ఇక బ్లాక్‌బెర్రీ 9360 క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉంది. మూడు మోడల్స్ కూడా బేసిక్ నెట్ వర్క్ బ్యాండ్స్ అయిన 3జీ‌ని సపోర్ట్ చేస్తాయి. బ్లాక్‌బెర్రీ 9360 స్క్రీన్ సైజు 2.44 ఇంచ్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ మూడు మోడల్స్‌కి గనుక చూసినట్లైతే 480 X 360తో రూపోందించబడ్డాయి. ఇక 9350, 9370 విషయానికి వస్తే 5 మెగా పిక్సల్ డిజిటల్ కెమెరాని కలిగి ఉన్నాయి. ఐతే రెండు మోడల్స్‌లలో కూడా ఎల్‌ఈడి ఫ్లాష్ లేకపోవడం కస్టమర్స్‌ని కొంచెం నిరాశకు గురిచేస్తుంది.

9360లో మాత్రం 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్ ప్రత్యేకం. 9350, 9370 రెండు మొబైల్స్ కూడా 4X కెమెరా డిజిటల్ జూమ్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇక మార్కెట్లో ప్రస్తుతం లభ్యమవుతున్న ఆడియో, వీడియో ఫార్మెట్లు MP3, MPEG4, AAC, FLAC, WMA, WAV, AMR, OGGలను కూడా సపోర్ట్ చేస్తాయి. మొబైల్‌కి బయట స్పీకర్స్‌ని కనెక్టు చేసుకునేందుకు గాను 3.5mm ఆడియో జాక్ ఉచితం. 9360 మొబైల్‌లో లౌడ్ స్పీకర్ ప్రత్యేకమైన ఫీచర్ కాగా, ఈ ఫీచర్ 9350, 9370లో లేదు.

ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, WiFi 802.11 b/g/n లను సపోర్ట్ చేస్తాయి. అన్ని మోడల్స్‌లలో కూడా బ్లూటూత్ 2.1 వర్సన్‌ని సపోర్ట్ చేస్తాయి. మొబైల్స్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఇక బ్యాటరీ పవర్ విషయానికి వస్తే 9350 బ్యాటరీ Li ion 1000 mAhని కలిగి ఉండడం వల్ల టాక్ టైం 5.5 గంటలు, స్టాండ్ బై టైమ్ 348 గంటలు వస్తుంది. అదే 9360లో Li ion 1050 mAh బ్యాటరీ, 9370లో Li ion 1000 mAh బ్యాటరీ మొబైల్‌తో పాటు లభించనున్నాయి.

ఇంత అత్యాధునికమైన ఫీచర్స్ ఉన్న బ్లాక్‌బెర్రీ మొబైల్స్ 9350, 9360, 9370 ధరలను ఇంకా మార్కెట్లోకి వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot