Just In
- 6 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 7 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 11 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 13 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
మంచి సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా..?
సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. వీటిని విక్రయించేందు ప్రత్యేకమైన వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌లో కొలువు తీరి ఉన్నాయి. పాత స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు విషయంలో కాస్తంత అవగాహన కలిగి ఆలోచనాత్మకంగా వ్యవహరించినట్లయితే డబ్బు ఆదా అవటంతో పాటు మన్నికైన ఫోన్ మీ చెంతకు చేరుతుంది. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం..
Redmi సంచలనం, రూ.6999కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్" title="

OLX, Quikr వంటి మార్కెట్ ప్లేస్‌లలో
OLX, Quikr వంటి మార్కెట్ ప్లేస్‌లలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసేముందు సంబంధిత సెల్లర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకోబోయే సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ ఏ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది..?, మోడల్ ఏంటి..? తరువాతి వర్షన్ అప్‌డేట్‌లు అందుకునే అవకాశం ఉందా..? ర్యామ్ సామర్ధ్యం ఎంత..? ప్రాసెసర్ వేగం ఎంత..? వంటి వివరాలను ముందుగా ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే రివ్యూలు ద్వారా చెక్ చేసుకోండి.

సోషల్ మీడియాలోనూ..
ఫేస్‌బుక్ ఆన్‌లైన్ అడ్డాగా మారిపోతోంది. ఈ సోషల్ మీడియా మాద్యమం ద్వారా రోజు అనేక డీల్స్ ఓకే అవుతున్నాయి. మీరు ఎంపిక చేసుకునే సెకండ్ హ్యాండ్ ఫోన్‌కు ఇక్కడ బోలెడన్ని యూజర్ రివ్యూలు దొరకుతాయి. అంతేకాదు, ఫోన్ గురించి సెల్లర్‌తో కూడా ఫేస్‌బుక్‌లో చాట్ చేయవచ్చు.

నమ్మకం ఎంతో ముఖ్యం
సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు ఆ ఫోన్‌కు సంబంధించిన బిల్స్ ఇంకా యాక్సెసరీస్ ఇంకా ఐఎమ్ఈఐ నెంబర్ ఖచ్చితంగా ఉందోలేదో చెక్ చేసుకోండి. భవిష్యత్‌లో మీకు ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మీకు పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రియిస్తోన్న వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలను ఆరా తీయటం మంది. అతనికి మంచి రెప్యుటేషన్ ఉంటేనే డీల్ ఓకే చేయండి.

స్పెసిఫికేషన్స్ గురించి
మీరు ఎంపిక చేసుకునే పాత ఫోన్ కనీసం 2జీబి లేదా 3జీబి ర్యామ్‌ను కలిగి ఉంటే మంచిది. ప్రాసెసర్ విషయానికొస్తే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ మంచి ఆప్షన్. డిస్‌ప్లే, కెమెరా, కీప్యాడ్, చార్జింగ్ పోర్ట్, సిమ్ స్లాట్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వంటి భాగాలు చురకుగా స్పందిస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫోన్ స్పీకర్స్ ఇంకా సౌండ్ క్వాలిటీని కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి. సిమ్‌కార్డ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడండి.

వారంటీ ఉండాలి..?
ఫోన్ గ్యారంటీ గురించిన వివరాలను పక్కాగా తెలుసుకోండి. సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌లకు గ్యారంటీ ఉండకపోవచ్చు. మీరు ఎంపిక కేసుకునే సెకండ్ హ్యాండ్ ఫోన్ బ్రాండెడ్ క్వాలిటీదై ఉంటే బాగుంటుంది. మీరు కొనదలుచుకున్న సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఇప్పుటికీ మార్కెట్లో లభ్యమవుతున్నట్లయితే ఆన్‌లైన్ మార్కెట్లో ఆ ఫోన్ అందుబాటుకి సంబంధించిన డీల్స్‌ను చెక్ చేసుకోండి. వాటిలో ఏదైనా డీల్ మీకు నచ్చినట్లయితే సెకండ్ హ్యాండ్ యానిట్‌కు బదలుగా కొత్త యూనిట్‌నే పొందవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470