Home
Mobile

మీ ఫోన్‌లో వైరస్‌ ఉందా..?

వైరస్‌‌లను తొలగించేందుకు ముఖ్యమైన సూచనలు..

By Sivanjaneyulu Bommu

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతుండటంతో వైరస్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మీ స్మార్ట్‌ఫోన్‌‍ను మాల్వేర్ల నుంచి కాపాడుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. మీ ఫోన్‌లోని వైరస్‌‌లను తొలగించేందుకు ముఖ్యమైన చిట్కాలను మీతో షేర్ చేసుకుంటన్నాం..

యాప్స్ విషయంలో జాగ్రత్త...

యాప్స్ విషయంలో జాగ్రత్త...

స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా ఏదైనా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ అప్లికేషన్‌కు సంబంధించి రివ్యూను ముందుగా చదవండి. ఇలా చేయటం ద్వారా ఆ అప్లికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఏదైనా నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉన్నట్లయితే ఆ అప్లికేషన్‌‌కు బదులుగా వేరొక మంచి అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకునే ముందు

అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకునే ముందు

అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకునే ముందు పర్మిషన్ లిస్ట్‌ను కూడా చెక్ చేసుకోవటం మంది. యాప్‌కు సంబంధించిన పర్మిషన్ లిస్ట్‌లో సదరు అప్లికేషన్‌కు సంబంధించి అనేక రకాల విషయాలు చర్చించబడతాయి.

విశ్వసనీయమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌

విశ్వసనీయమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌

విశ్వసనీయమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వైరస్ ముప్పు నుంచి బయటపడవచ్చు. ఎప్పటికప్పుడు సదరు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తుండండి.

రోజూ స్కాన్ చేయండి...

రోజూ స్కాన్ చేయండి...

స్మార్ట్‌ఫోన్‌ను క్రమం తప్పకుండా రోజు స్కాన్ చేస్తుండటం వల్ల ప్రమాదకర ఫైళ్లు మీ ఫోన్‌లోకి చేరవు. మీ స్మార్ట్‌ఫోన్‌లోని వైరస్‌ను మాన్యువల్‌గా తొలగించాలంటే ముందుగా మీ డివైస్‌లోని వైరస్‌కు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలిసి ఉండాలి.

 సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి

సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి

వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి. ఇందుకు ఫోన్ యూజర్ మాన్యువల్‌ను అవగాహన చేసుకోండి. ఆన్‌లైన్ యాంటీ వైరస్ టూల్స్‌ను ఆశ్రయించటం ద్వారా మంచి ఫలితాలు రాబట్టే అవకాశముంది.

 గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోండి

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోండి

అప్లికేషన్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోండి. కొత్త పంథాను అనుసరిస్తున్న హ్యాకర్లు వైరస్‌లతో కూడిన నకిలీ అప్లికేషన్‌లను నెట్‌లో సృష్టిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Tips for Removing Viruses from Android Devices. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X