గెస్ట్ మోడ్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుకోవటం ఎలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గెస్ట్‌ యూజర్‌ మోడ్‌‌ను ఉపయోగించటం ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని వేరొకరు చూడకుండా జాగ్రత్త పడవచ్చు..

|

కొన్ని సందర్భాల్లో మొహమాటం కొద్ది మన వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌లను ఇతరులకు ఇవ్వవల్సి వస్తుంటుంది. కొంత మంది ఇతరుల ఫోన్‌‍లతో ఎంత వరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తిస్తారు. కొందరు మాత్రం ఆ ఫోన్ మనది కాదని తెలిసినా ఆ ఫోన్‌లోని వ్యక్తగత డేటాను తెలుసుకోవాలన్న కుతూహలంతో యజమాని ప్రమేయం లేకుండానే ఫోన్‌ను మొత్తం జల్లెడపట్టేస్తారు. ఇలాంటి వాళ్ల చేతికి మన ఫోన్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

 

నోకియా 6కు గట్టిపోటీ ఇస్తోన్న 5 స్మార్ట్‌ఫోన్‌లునోకియా 6కు గట్టిపోటీ ఇస్తోన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనపుడు

ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనపుడు

ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనపుడు గెస్ట్ మోడ్ పీచర్ ద్వారా ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని వేరొకరు చూడకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌లోని పర్సనల్ డేటాకు పూర్తిస్ధాయి భద్రతను కల్పిస్తుంది. మీ ఈ-మెయిల్స్ అదేవిధంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల అపడేట్స్‌ను అవతలి వ్యక్తి కంట పడకుండా చర్యలు తీసుకుంటుంది.

ఫోన్‌ను ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకోవచ్చు

ఫోన్‌ను ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకోవచ్చు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గెస్ట్‌ మోడ్‌‌ను ఉపయోగించటం ద్వారా ఫోన్‌ను ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు ఎంత వరకు వీక్షించాలో కూడా నిర్ధేశించుకోవచ్చు. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపై ఫోన్‌లలో గెస్ట్‌ మోడ్‌ను ఏలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్
 

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని నోటిఫికేషన్ బార్‌లోకి వెళ్లండి. టాప్ రైట్‌లో కనిపించే మీ అవతార్ పై రెండు సార్లు టాప్ చేయండి. వాటిలో Add guest ఐకాన్ పై టాప్ చేసి ఉంచండి. ఇప్పుడు మీ ఫోన్ గెస్ట్ మోడ్‌లోకి మారిపోతుంది.

పాఠకులకు గమనిక : ఆండ్రాయిడ్ గెస్ట్ మోడ్ మీ ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే, మీ డివైస్ ఖచ్చితంగా ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపై వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవ్వాల్సి ఉంటుంది.

గెస్ట్ మోడ్ నుంచి బయటకు రావాలంటే..?

గెస్ట్ మోడ్ నుంచి బయటకు రావాలంటే..?

గెస్ట్ మోడ్ సెషన్ పూర్తి అయిన వెంటనే తిరిగి మీ గూగుల్ అకౌంట్‌లోకి వచ్చేందుకు నోటిఫికేషన్ బార్‌లోకి వెళ్లి టాప్ రైట్‌లో కనిపించే మీ అవతార్ పై రెండు సార్లు టాప్ చేయండి. your Google account, Add guest, Add user పేర్లతో మూడు ఐకాన్‌లు మీకు కనిపిస్తాయి. వాటిలో your Google account ఐకాన్ పై టాప్ చేసినట్లయితే తిరిగి మీ అకౌంట్ లోకి వచ్చేస్తారు. అంతేకాదు, గెస్ట్ సెషన్‌లో బ్రౌజ్ చేసిన డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది.

Best Mobiles in India

English summary
Tips to set up Guest Mode on Android. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X