మీ ఫోన్‌లో GPS పనిచేస్తోందా..?
కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో జీపీఎస్ ఫీచర్ ఫేలవమైన పనితీరును కనబరుస్తుంటుంది. ఈ సమస్యకు ఫోన్ హార్డ్‌వేర్ ప్రధాన కారణం కావొచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లలో ఉండాల్సిన ముఖ్యమైన ఫీచర్లలో జీపీఎస్ ఒకటి. శాటిలైట్ ఆధారంగా స్పందించే ఈ నావిగేషన్ వ్యవస్థ పూర్తి పేరు గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం. జీపీఎస్ ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే చాలు దారి తెలియకపోయినా ఎక్కడికైనా సలువుగా వెళ్లిపోవచ్చు.

24 ఉపగ్రహాల సహకారంతో..
జీపీఎస్ ఫీచర్, మనం చేరుకోవల్సిన గమ్యాన్ని మలుపులతో సహా చూపిస్తుంది. జీపీఎస్ సిస్టంను 24 ఉపగ్రహాల సహకారంతో అమెరికా అభివృద్థి చేసింది. ఈ ఉపగ్రహాలు భూమిని మొత్తం కవర్ చేస్తూ శాటిలైట్ ద్వారా సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేస్తుంటాయి. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో జీపీఎస్ ఫీచర్ ఫేలవమైన పనితీరును కనబరుస్తుంటుంది. ఈ సమస్యకు ఫోన్ హార్డ్‌వేర్ ప్రధాన కారణం కావొచ్చు.

High Accuracy మోడ్..
ఫోన్ సెట్టింగ్స్‌లోని High Accuracy మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా జీపీఎస్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. High Accuracy మోడ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ఆ తరువాత లోకేషన్ సర్వీసును టర్న్ ఆన్ చేసుకోండి. అక్కడ కనిపించే Location Sources categoryలో High Accuracy మోడ్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా జీపీఎస్ సిగ్నల్ సామర్థ్యం మరింత రెట్టింపు అవుతుంది.

GPS Essentials యాప్
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న GPS Essentials యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా జీపీఎస్ పనితీరును మరింత మెరుగుపరుచుకోవచ్చు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత కూడా జీపీఎస్ సిగ్నల్ మందకొడిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్‌లో హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ సమస్యలు ఉన్నట్లే.

ప్రతి ఫోన్‌లో జీపీఎస్ ఉండాలి..
జనవరి 1, 2018 నుంచి విక్రయించే ప్రతి ఫోన్‌లో జీపీఎస్ (గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం) టెక్నాలజీ ఉండితీరాలని మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం కోరింది.

సెక్యూరిటీ పరంగా జీపీఎస్ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది
ముఖ్యంగా ఎమర్జెన్సీ పరస్థితుల్లో వినియోగదారుల ఆచూకీని ఈ జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసే వీలుంటుంది. ఈ టెక్నాలజీ చాలా ఖరీదుతో కూడుకుని ఉండటంతో జీపీఎస్ సౌకర్యంతో వచ్చే బేసిక్ ఫోన్‌ల ధరలు 50% వరకు పెరగే అవకాశముందని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. అంటే ఇప్పుడు రూ.1000 పెట్టి కొనుగోలు చేస్తున్న ఫోన్ ధర అప్పుడు రూ.1500 వరకు పెరగొచ్చన్న మాట.

ఫీచర్ ఫోన్‌లలో జీపీఎస్ టెక్నాలజీ..
ఫీచర్ ఫోన్‌లలో జీపీఎస్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయాలంటే హై-కాన్ఫిగరేషన్ అవసరమవుతుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏ-జీపీఎస్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్, టెలికాం శాఖను కోరినప్పటికి ఫలితం లేకుండాపోయింది. ఏ-జీపీఎస్ టెక్నాలజీని వినియోగించటం వల్ల ఫోన్ ఏ టవర్ పరిధిలో ఉందో తెలుసుకునే వీలుంటుంది. అయితే, ఆ ఫోన్ ఎక్కడుందీ అనే స్పష్టమైన లొకేషన్‌ను మాత్రం ట్రేస్ చేయటం కుదరదు.


Click it and Unblock the Notifications