రూ.4,500కే సామ్‌సంగ్ కొత్త ఫోన్, Jio 4G ఉచితం

తన సొంతం Tizen ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే Samsung Z2 స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఇండియా మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.4,590. గెలాక్సీ జే సిరీస్ ఫోన్స్ తరహాలోనే ఎస్ బైక్ మోడ్, అల్ట్రా డేటా సేవింగ్ మోడ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్‌లో సామ్‌సంగ్ పొందుపరిచింది. బ్లాక్, గోల్డ్ ఇంకా వైన్ రెడ్ కలర్ వేరింయట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Read More : ఆన్‌లైన్‌లో అమ్మకానికి విమానం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆగష్టు 29 నుంచి మార్కెట్లోకి..

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్ మార్కెట్లో Paytm online ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. ఆగష్టు 29 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ఆఫ్‌లైన్ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంటుంది.

రిలయన్స్ జియో ఉచితం...

ఈ ఫోన్ కొనుగోలు పై రిలయన్స్ జియో అందిస్తోన్న 4జీ Jio ప్రివ్యూ ఆఫర్‌లో భాగంగా 90 రోజుల ఉచిత వాయిస్ ఇంకా డేటా సేవలను ఆస్వాదింవచ్చు.

 

Samsung Z2 స్పెసిఫికేషన్స్

4 అంగుళాల WVGA TFT డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), Tizen OS 2.4 ఆపరేటింగ్ సిస్టం,

Samsung Z2 స్పెసిఫికేషన్స్

1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

Samsung Z2 స్పెసిఫికేషన్స్

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఆప్షన్స్ (4G VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ ఎస్ బైక్ మోడ్ అంటే..?

స్మార్ట్‌ఫోన్‌‌లో ఈ మోడ్‌‌ను ఎనేబుల్ చేసి బైక్ నడుపుతున్నప్పుడు మనకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే, మన స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా కాల్ చేసిన వారికి తర్వాత కాల్ చేయండి అనే మెసేజ్‌ను పంపుతుంది. దీంతో రైడర్స్ మాటిమాటికీ తమ మొబైల్ చూసుకోకుండా డ్రైవింగ్‌పైనే దృష్టి సారించవచ్చు. అదే ఎమర్జెన్సీ అయితే కాల్ చేసిన వారు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఒకటి అంకెను ప్రెస్ చేసినట్లయితే అర్జెంట్ కాల్ అని డ్రైవింగ్ చేస్తున్న వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు బండిని పక్కాగా పార్క్ చేసి కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tizen-Powered Samsung Z2 Goes Official with Jio 4G Preview Offer at Rs 4,590. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot