పవిత్ర ఖురాన్ పఠనం ఇక మీ మొబైల్‌లో..

Posted By: Staff

పవిత్ర ఖురాన్ పఠనం ఇక మీ మొబైల్‌లో..

 

ముస్లిం సొదరులకు శుభవార్త. టోల్‌మోల్.కామ్‌ అనే ఆన్ లైన్ సంస్ద, ప్రముఖ మలేసియా డిజిటల్ ఇస్లామిక్ ఉత్పత్తులను అందించే 'ఈఎన్‌మ్యాక్ ఇంజనీరింగ్' అనే సంస్దతో కలసి ఇండియాలో మొట్టమొదటి సారి పవిత్ర ఖురాన్ పఠనాన్ని వినిపించే కొత్త ఫోన్‌ 'ఎమ్‌క్యూ 3500' ని ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వెబ్‌సైట్లు, టోల్‌మోల్.కామ్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే కొత్త ఖురాన్ మొబైల్ ఫోన్ ధరను రూ.3,950గా నిర్ణయించారు.

ఇప్పటికే ఈ ఫోన్ దుబాయ్, పాకిస్థాన్, మలేసియా దేశాల్లో మార్కెట్లో అందుబాటులో ఉండగా, ఇప్పడు ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని టోల్‌మోల్.కామ్ కో-ఫౌండర్, సీఈవో అనూజ్ ఖనీష్ చెప్పారు. ఈ మొబైల్ ద్వారా ఉర్దూ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తమిళం ఇలా 29 భాషల్లోనూ ఖురాన్‌ను వినొచ్చని తెలిపారు. డ్యూయల్ సిమ్ ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్‌ని రిటైల్ తరహాలోనూ విక్రయాలు చేపట్టేందుకు ఇతర సంస్థలతో కంపెనీ చర్చలు జరుపుతోందని ఇంటర్యూలో తెలిపారు.

వీటితో పాటు ఇండియన్ మార్కెట్లోకి త్వరలో మరిన్ని ఇస్లామిక్ ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. మేము ప్రవేశపెట్టనున్న వాటిల్లో ముఖ్యంగా డిజిటల్ ఖురాన్, ఇస్లామిక్ ఈ - బుక్స్, హై ఎండ్ పీచర్స్ కలిగిన అధునాతన మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. డిసెంబర్ మొదటి వారంలో 'ఎమ్‌క్యూ 3500' మొబైల్‌ని ఇండియన్ రిటైల్ మార్కెట్లలో కస్టమర్స్ కొనుగోలు చేయవచ్చని అన్నారు.

'ఎమ్‌క్యూ 3500' మొబైల్‌ ప్రత్యేకతలు:

నెట్ వర్క్: GSM 900/DCS 1800 Mhz

డిస్ ప్లే టైపు:True Color TFT LCD

డిస్ ప్లే సైజు:Screen Res - 176x220 - 2.0" inch

ఫోన్ బుక్:1000 entries

జిపిఆర్ఎస్:Yes

కెమెరా ప్రైమరీ:Yes

మెసేజింగ్ ఫీచర్:SMS, MMS

బ్రౌజర్: WAP

రేడియో:FM Radio

బ్యాటరీ టైపు:Standard battery, 1400 mAh

బ్యాటరీ స్టాండ్ బై:4 Days

బ్యాటరీ టాక్ టైమ్:150 minutes

అదనపు ప్రత్యేకతలు: Image Viewer, Video Player, Slim and Compact Design

Complete Quran Recitation in voice of Famous 7 Qari (Recitors)

Auto Silent Mode during Pray Times in Masjid

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot