Home
Mobile

ప్రపంచం మొత్తం మీద 2019లో అత్యధికంగా అమ్ముడైన 10 స్మార్ట్‌ఫోన్‌లు

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్‌లు రెండు ఉన్నందున ఆపిల్ యొక్క హవా ఇప్పటికి కొనసాగుతోంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ యొక్క నివేదిక ప్రకారం "ఐఫోన్ XR స్మార్ట్‌ఫోన్‌ 2019 క్యూ 3 లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మోడల్లలో మొదటి స్థానంలో ఉంది.

స్మార్ట్‌ఫోన్‌లు

ఇది ప్రపంచం మొత్తం మీద 3% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది." శామ్సంగ్, ఒప్పో, షియోమి నుండి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఈ సంవత్సరం తమ సత్తాను చాటుకున్నాయి. 2019 లో ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా అమ్ముడవుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

1. iPhone XR ధర Rs.49,900

1. iPhone XR ధర Rs.49,900

2018 లో ప్రారంభమైన ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ ‘సరసమైన' ఐఫోన్‌గా పిచ్ చేశారు. దీని యొక్క సేల్స్ నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ తరువాత ఈ ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా గొప్పగా అమ్ముడైంది. 2019 లో అత్యధికంగా అమ్ముడైన వాటిలో ఇది మొదటి స్థానంలో ఉంది.

 

 

2. Samsung A10 ధర Rs.7,990

2. Samsung A10 ధర Rs.7,990

2019 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన శామ్‌సంగ్ యొక్క ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా అధికంగా అమ్ముడైంది. ఇది గొప్ప ఆఫర్లతో అందరి దృష్టిని ఆకట్టుకున్నది. దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.20-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, ఎక్సినోస్ 7884 ప్రాసెసర్ మరియు 2 జిబి ర్యామ్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

3. Samsung Galaxy A50: ధర Rs.17,990

3. Samsung Galaxy A50: ధర Rs.17,990

శామ్సంగ్ నుండి వచ్చిన మరొక స్మార్ట్‌ఫోన్‌ మిడ్ రేంజ్ ధరతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉన్న ఇది 2019లో ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా అమ్ముడైన వాటిలో మూడవ స్థానంలో నిలిచింది.

 

4. Oppo A9 ధర Rs.11,990

4. Oppo A9 ధర Rs.11,990

ఈ జాబితాలో ఒప్పోA9 స్మార్ట్‌ఫోన్‌ కూడా నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ కెమెరా, 4 జీబీ ర్యామ్, 6.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి వున్న మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇది మిడ్ రేంజ్ విభాగంలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకట్టుకున్నది.

 

5. iPhone 11 ధర Rs.64,900

5. iPhone 11 ధర Rs.64,900

2019 లో అత్యధికంగా అమ్ముడైన కొత్త ఆపిల్ ఫోన్ లలో ఐఫోన్ యొక్క రెండవది ఐఫోన్ 11. ఇది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లలో ఐదవ స్థానాన్ని పొందింది.

 

 

 

6. Oppo A5s: ధర Rs.11,990

6. Oppo A5s: ధర Rs.11,990

ఈ జాబితాలో ఒప్పో సంస్థ యొక్క రెండవ స్మార్ట్‌ఫోన్‌ ఒప్పోA5. ఇది చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో నుండి వచ్చిన ఎంట్రీ-లెవెల్ స్మార్ట్‌ఫోన్. ఎంట్రీ-లెవెల్ విభాగంలో శామ్సంగ్ తరువాత ఎక్కువ అమ్ముడైన వాటిలో ఇది ఉంది.

 

 

7. Samsung Galaxy A20: ధర Rs.11,490

7. Samsung Galaxy A20: ధర Rs.11,490

శామ్సంగ్ సంస్థ నుండి వచ్చి అధికంగా అమ్ముడైన మూడవ ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్‌ శామ్సంగ్ గెలాక్సీ A20. ఇది బడ్జెట్ విభాగంలో ఉండి అందరిని ఎక్కువగా ఆకర్శించింది. ఏది ఏమైనా ఈ జాబితాలో శామ్సంగ్ కంపెనీ యొక్క ఫోన్లు మూడు ఉన్నాయి.

8. Oppo A5: ధర Rs.10,990

8. Oppo A5: ధర Rs.10,990

ఒప్పో నుండి వచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

9. Xiaomi Redmi 7A: ధర Rs.4,999

9. Xiaomi Redmi 7A: ధర Rs.4,999

జాబితాలో ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారి సంస్థ షియోమి నుండి వచ్చిన ఏకైక ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 7A. ఇది రూ.4,999 ధరను కలిగి ఉండి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ అనుభవం పొందాలనుకునే వారి కోసం తయారుచేయబడింది.

Best Mobiles in India

English summary
Top 10 Best Selling Smartphones In The World
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X