ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

Posted By:

 దేశీయంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు మరింత క్రేజ్ ఏర్పడింది. తాము కోరుకున్న జీవనశైలిలో భాగంగా ఖర్చును ఏమాత్రం లెక్కచేయని యువత అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. 'మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ అంతర్దృష్టి' అనే అంశం పై ప్రిసిషన్ మ్యాచ్ అనే సంస్థ ఇటీవల ఆన్‌లైన్ సర్వేను నిర్వహించింది. ఈ అధ్యయనంలో భాగంగా డిసెంబర్ 2012 నుంచి ఫిబ్రవరి 2013 వరకు అంతర్జాలంలో అత్యధికంగా శోధించిబడిన స్మార్ట్‌ఫోన్‌ల సమాచారాన్ని పరగణలోకి తీసుకోవటం జరిగింది.

దేశవాళీ బ్రాండ్‌లకు ఈ ఫలితాలు నిరాశే అని చెప్పొచ్చు. మైక్రోమ్యాక్స్ మినహా ఏ ఒక్క దేశావాళీ బ్రాండ్ ఈ సర్వేలో చోటు దక్కించుకోలేకపోయింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తూ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న మైక్రోమ్యాక్స్ ఈ సర్వేలో రెండో స్థానాన్ని దక్కిచుకుంది. సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ 31శాతం శోధనా ఫలితాలతో మొదటి స్థానంలో నిలిచింది. మైక్రోమ్యాక్స్ 17%, నోకియా 16% శోధనా ఫలితాలతో తరువాతి స్థానాలను ఆక్రమించాయి. యాపిల్, సోనీ, బ్లాక్‌బెర్రీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ వంటి బ్రాండ్‌లు అంతగా ప్రభావం చూపలేక పోయాయి. సర్వేలో భాగంగా ఆన్ లైన్ లో అత్యధికంగా శోధించబడిన 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy S3):

4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్,
క్వాడ్-కోర్ 1.4గిగాహెట్జ్ కార్టెక్స్- ఏ9 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ 16/32జీబి,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
వై-ఫై, బ్లూటూత్, 2,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

మైక్రోమ్యాక్స్ ఏ110 కాన్వాస్ 2 (Micromax a110 Canvas 2):

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,
2000 ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ(5 గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై).

ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ (Samsung Galaxy S Duos):

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
786ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.12,999.
లింక్ అడ్రస్:

ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

యాపిల్ ఐఫోన్ 5 (Apple iPhone 5):

4 అంగుళాల డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్,
యాపిల్ ఏ6 చిప్‌సెట్, 16జీబి/32జీబి/64జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఐసైట్ టెక్నాలజీ),
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై 802.11 బి/జి/ఎన్,
బ్లూటూత్, 4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0,
బ్యాటరీ బ్యాకప్ (8 గంటల టాక్‌టైమ్, 225 గంటల స్టాండ్‌బై).

ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2(Samsung Galaxy Note 2):

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, బ్లూటూత్, ఎస్‌పెన్ సపోర్ట్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
32జీబి అదనపు స్టోరేజ్,
3,100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ డ్యుయోస్ (Samsung Galaxy Ace Duos):

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై, డ్యూయల్ సిమ్ సపోర్ట్,
3జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
512 ఎంబి ర్యామ్,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.9,850.
లింక్ అడ్రస్:

ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

సామ్‌సంగ్ గెలాక్సీ వై ఎస్5360 (Samsung Galaxy Y S5360):

3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
180 ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
మైక్రో యూఎస్బీ 2.0, బ్లూటూత్,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (స్టాండ్‌బై 540 గంటలు, టాక్‌టైమ్ 6.5 గంటలు),
ధర రూ.5,649
లింక్ అడ్రస్:

ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్ 2 (Samsung Galaxy Tab 2):

7 అంగుళాల పీఎల్ఎస్ టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
సిమ్ స్లాట్ (వాయిస్ కాలింగ్ నిర్వహించుకునేందుకు),
ధర రూ.15,900
లింక్ అడ్రస్:

ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 (Samsung Galaxy S2):

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ 16జీబి/32జీబి,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1650ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ధర రూ.21,500.
లింక్ అడ్రస్:

ఆన్‌లైన్ సర్వే: 10 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

హెచ్‌టీసీ డిజైర్ వీ (HTC Desire V):

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్ 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ. 12,400
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot