Just In
- 2 min ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- Movies
Veera Simha Reddy 15 Days Collections: కలిసొచ్చిన హాలీడే.. 3 రెట్లు పెరిగిన వసూళ్లు.. లాభాలు చూస్తే!
- News
వైఎస్సార్ స్వాంతంత్ర్య సమరయోధుడా? రిపబ్లిక్ డే సాక్షిగా వైఎస్ షర్మిలకు తప్పని ట్రోల్స్!!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Refurbished ఫోన్లు ఎక్కడ దొరుకుతాయంటే..?
చిన్నచిన్న రిపేర్‌లు లేదా డామెజ్‌లు ఏర్పడిన ఫోన్లను తిరిగి ఆధునీకరించి సేల్ చేసే ఫోన్‌లనే రిఫర్బిషిడ్ (Refurbished) ఫోన్స్ అని అంటారు. కొత్త ఫోన్‌లతో పోలిస్తే రిఫర్బిషిడ్ ఫోన్‌లు తక్కువ ధరకే వచ్చేస్తాయి. పెర్మామెన్స్ సమస్యలు కూడా అంతగా ఉండవు. రిఫర్బిషిడ్ ఫోన్‌లు క్వాలటీ ఇన్స్‌పెక్షన్ టెస్ట్‌లను పాసైన తరువాతనే మార్కెట్లోకి వస్తాయి. కాబట్టి వీటిలో హార్డ్ వేర్ సమస్యలు తలెత్తే ఛాన్సే ఉండదు. వారంటీ కూడా వర్తిస్తుంది. రిఫర్బిషిడ్ ఫోన్‌ను కొనుగోలు చేసి వాడటం మొదలు పెట్టడం ద్వారా ఫోన్ సాఫ్ట్‌వేర్ పై మరింత అవగాహన పెరుగుతుంది. తరువాత మీరు కొనుగోలు చేయబోయే కొత్త పోన్‌ను సులువుగా టాకిల్ చేయగలుగుతారు. రిఫర్బిషిడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ మార్కెట్ ప్లేస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్ (Amazon)
రిఫర్బిషిడ్ ఎలట్రానిక్స్‌ను విక్రయిస్తోన్న అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్లలో అమెజాన్.కామ్ ఒకటి. రిఫర్బిషిడ్ ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యేకమైన సెక్షన్‌ను ఈ వెబ్‌సైట్ కేటాయించింది. యూజర్లు ఈ సెక్షన్‌లోకి వెళ్లి కావల్సిన మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఓవర్‌స్టాక్ (Overstock)
రిఫర్బిషిడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను విక్రయిస్తోన్న ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో ఓవర్‌స్టాక్ ఒకటి. ఈ వెబ్‌సైట్‌లో లిమిటెడ్ మోడల్సే అందుబాటులో ఉన్నప్పటికి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. మీరు మిడ్ రేంజ్ రిఫర్బిషిడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ సైట్ మీకు బెస్ట్ ఆప్షన్.

వాల్‌మార్ట్ (Walmart)
రిఫర్బిషిడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను వాల్‌మార్ట్ ఫిజికల్ స్టోర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ స్టోర్స్‌లో ఫోన్‌లను కొనుగోలు చేసేముందు వాటిని ఫిజికల్‌గా చెక్ చేసుకునే వీలుంటుంది.

న్యూఎగ్ (Newegg)
యూఎస్ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ వెబ్‌సైట్ పీసీ కాంపోనెంట్‌లతో పాటు రిఫర్బిషిడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను కూడా విక్రయిస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో లిమిటెడ్ మోడల్సే అందుబాటులో ఉన్నప్పటికి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఇవి లభ్యమవుతున్నాయి.

బెస్ట్‌బుయ్ (BestBuy)
అమెరికాలో పెద్ద సంఖ్యలో రిటైల్ స్టోర్‌లను కలిగి ఉన్న బ్రాండ్‌లలో బెస్ట్‌బుయ్ ఒకటి. ఈ చెయిన్‌లింక్ స్టోర్‌లలో వేల కొలది రిఫర్బిషిడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ఇక్కడ గూగుల్ నెక్సుస్ 6పీ వంటి ఫోన్‌లను 370 డాలర్లకే సొంతం చేసుకోవచ్చు.

ఈబే (EBay)
రిఫర్బిషిడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను విక్రయిస్తోన్న ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో ఈబే (EBay) ఒకటి. ఈ సైట్‌లో ఫోన్‌లను కొనుగోలు చేసే ముందు సెల్లర్ బ్యాడ్జ్‌తో పాటు రివ్యూస్ అలానే రేటింగ్స్‌ను చెక్ చేసుకోవటం మంచిది.

ఏటీ&టీ (AT&T)
అమెరికాకు చెందిన ప్రముఖ టెలిఫోన్ ఆపరేటింగ్ కంపెనీ ఏటీ&టీ తన వెబ్‌సైట్‌లో రిఫర్బిషిడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను కూడా విక్రయిస్తోంది. వీటిని కాంట్రాక్ట్ పై కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే ఇవి ఆ క్యారియర్‌తో పూర్తిగా లాక్ అయి ఉంటాయి.

సామ్‌సంగ్ (Samsung)
టీ-మొబైల్ (T-Mobile)
అమెరికాకు చెందిన ఈ వైర్‌లెస్ నెట్‌వర్క్ ఆపరేటర్ వివిధ వెరైటీలలో రిఫర్బిషిడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను విక్రయిస్తోంది. వీటిని రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పై కొనుగోలు చేయవచ్చు.
సామ్‌సంగ్ (Samsung)
రిఫర్బిషిడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను విక్రయిస్తోన్న ప్రముఖ బ్రాండ్‌లలో సామ్‌సంగ్ కూడా ఒకటి. ఆండ్రాయిడ్ ఫోన్‌లను పెద్ద సంఖ్యలో తయారు చేస్తోన్న ఈ బ్రాండ్ అదేస్థాయిలో వాటిని విక్రయిస్తోంది. సామ్‌సంగ్ అందించే రిఫర్బిషిడ్ ఫోన్‌లు మన్నికైన క్వాలిటీని కలిగి ఉంటాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470