ఉత్కంఠ రేపుతున్న పుకార్లు..?

Posted By: Prashanth

ఉత్కంఠ రేపుతున్న పుకార్లు..?

 

ప్రపంచ దేశాల్లోని గ్యాడ్జెట్ ప్రియులు ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఆ మధరు క్షణాలు మరి కొద్ది గంటల్లో ఆవిష్కృతం కానున్నాయి. గత కొంత కాలంగా టెక్ ప్రపంచంలో అలజడి రేపుతున్న స్మార్ట్‌ఫోన్ సామ్ సంగ్ గెలక్సీ ఎస్3 ఆవిష్కరణకు సమయం సమీపిస్తోంది. ఈ నేపధ్యంలో డివైజ్‌కు సంబంధించి అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి......

- ప్రధానంగా ఈ డివైజ్ పేరుకు సంబంధించి తర్జన భర్జనలు నెలకున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొందరు గెలాక్సీ ఎస్3‌గా అభివర్ణిస్తుంటే, మరికొందరు గెలాక్సీ ఎస్IIIగా పిలుస్తున్నారు. ఈ రెండింటిలో ఏది వాస్తవం..?

- అత్యాధునిక స్సెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్‌లో శక్తివంతమైన ఆర్మ్ కార్టెక్స్ 9, Exynos 4 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసినట్లు ప్రచారం బలంగా జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజమో మరికొద్ది గంటల్లో తేలుతుంది.

- ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే సైజ్ 4.65 to 4.8 అంగుళాల మధ్య ఉంటుందని అంచనా. డిస్‌ప్లే పై అభిమానుల్లో నెలకున్న సందిగ్థతకు ఈ రోజే తెరపడనుంది.

- ఫోన్ స్ర్కీన్ పటిష్టమైన సూపర్ ఆమోల్డ్‌ప్లస్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుందని ఓ పుకారు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థలను ఫోన్‌లో ప్రత్యేక అంశాలుగా నిలుస్తాయిన్నది మరో బోగట్టా.

- తాజాగా ఆమోజన్, ఈ పోన్ మెమెరీకి సంబంధించి పలు వివరాలను ప్రకటిస్తూ ... నిక్షిప్తం కాబడి ఉన్న 16జీబి మెమెరీని మైక్రోఎస్డీ మెమరీ కార్డ్‌స్లాట్ ఆధారితంగా 32జీబికి పొడిగించుకోవచ్చని తెలిపింది.

- ఈ డివైజ్‌ను ఆవిష్కరించిన వారం రోజులకే పంపిణి కార్యక్రమం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot