2016లో, జనం మెచ్చిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (రూ.10,000 రేంజ్‌‌లో)

ఈ ఏడాదిగాను రూ.10,000 సెగ్మెంట్‌లో డజన్లు కొద్ది బ్రాండ్‌లు పోటీపడ్డాయి.

|

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ఈ ఏడాదిగాను మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ముఖ్యంగా రూ.10,000 సెగ్మెంట్‌లో డజన్లు కొద్ది బ్రాండ్‌లు పోటీపడ్డాయి. ఈ సంగ్రామంలో కొన్ని బ్రాండ్‌లు మాత్రమే మార్కెట్లో నిలదొక్కుకో
గలిగాయి. ఆధునిక స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో, 2016కుగాను మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : రూ.5,000లో 4జీ ఫోన్‌లు ఇవే!

షియోమీ రెడ్మీ  నోట్ 3

షియోమీ రెడ్మీ నోట్ 3

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల మెరుగైన హైడెఫినిషన్ డిస్‌ప్లే‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 720x1280 పిక్సల్స్. రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచిన 64 బిట్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది. రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ పూర్తి మోటాలిక్ ఫినిషింగ్‌తో వస్తోంది. ఈ మెటాలిక్ ఫినిషింగ్ ఫోన్‌కు క్లాసికల్ లుక్‌ను తీసుకువస్తుంది. రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. ఇవి హై క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయి. ర్యామ్ ఆప్షన్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు పరిశీలించినట్లయితే.. 2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టువిటీ. షియోమీ సంస్థ విడుదల చేసిన మొదటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ రెడ్‌మీ నోట్ 3 కావటం విశేషం. ఈ స్కానర్ ను సెక్యూరిటీ అవసరాలకు మాత్రమే కాదు సెల్ఫీ అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Lenovo K6 Power

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్. ఫింగర్ - ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX258 సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం. 4జీ వోల్ట్ సపోర్ట్. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్‌తో లభ్యమయ్యే ఈ ఫోన్ ధర రూ.9,999. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart, ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

Lenovo Vibe K5 Plus

Lenovo Vibe K5 Plus

లెనోవో వైబ్ కే5 ప్లస్

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3 జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. 3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఓమ్నీవిజన్ OV13850 సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్, 5 పిక్సల్ లెన్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 4జీ, 3జీ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. డాల్బీ అటామస్ ఫీచర్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో 2,750 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీని ఏర్పాటు చేసారు.

 లీఇకో లీ1ఎస్

లీఇకో లీ1ఎస్

లీ1ఎస్ ఫోన్, ప్రపంచపు మొట్టమొదటి మిర్రర్ సర్‌ఫేస్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 5.5 అంగుళాల FHD డిస్‌ప్లే, హీలియో ఎక్స్ 10 టర్బో ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, యూఎస్బీ  టైప్ సీ పోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు లీ1ఎస్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

హానర్ 5సీ

హానర్ 5సీ

హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. డిస్‌ప్లే రిసల్యూషన్ వచ్చేసరికి 1920 x 1080 పిక్సల్స్, ట్రాన్స్‌లేట్ చేస్తే 424 పీపీఐ. ఈ డిస్‌ప్లేను గొప్ప విజువల్ ట్రీట్‌గా చెప్పుకోవచ్చు. మంచి రిసల్యూషన్, పిక్షర్ క్వాలిటీ, కలర్ రీప్రొడక్షన్, వ్యూవింగ్ యాంగిల్స్ వంటి అంశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. హానర్ 5సీ పోన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వస్తోంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన కైరిన్ 650 చిప్‌సెట్ 40 శాతం తక్కువ బ్యాటరీ శక్తిని మాత్రమే ఖర్చుచేసుకుని 65శాతం ఎక్కువ ప్రాసెసింగ్ వేగాన్ని అందించటంతో బ్యాటరీ బ్యాకప్ మరింత రెట్టింపు అవుతుంది. హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్.. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,హానర్ 5సీ స్మార్ట్‌ఫోన్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్ లైట్, పీడీఏఎఫ్, నైట్ మోడ్, గుడ్ ఫుడ్ మోడ్, బ్యూటీ మోడ్, లైట్ పెయింటింగ్ మోడ్ వంటి పీచర్లు ఫోన్ ఫోటోగ్రఫీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయి. డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, యూఎస్బీ టైప్-సీ వంటి స్టాండర్డ్ కనెక్టుకవిటీ ఆప్షన్ లను హానర్ 5సీలో చూడొచ్చు. సరిగ్గా ఇలాంటి స్పెసిఫికేషన్సే రెడ్మీ నోట్ 3లో కూడా ఉన్నాయి.

రెడ్మీ 3ఎస్ ప్రైమ్

రెడ్మీ 3ఎస్ ప్రైమ్

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌ రెడ్మీ నోట్ 3కి దగ్గరగా ఉంటుంది. ఈ ఫోన్‌ మందం 8.5 మిల్లీ మీటర్లు. బరువు విషయానికి వచ్చేసరికి 144 గ్రాములు. మెటల్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్‌ ప్రీమియమ్ లుక్‌ను కలిగిస్తుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ప్రైమ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి.. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. (ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్, ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ రికార్డింగ్, హెచ్‌డీఆర్, హెచ్‌హెచ్‌టీ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి) .సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతాయి. 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఆర్ఎస్, జీపీఎస్, గ్లోనాస్. రెడ్మీ 3ఎస్ ప్రైమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది.

Asus Zenfone Max

Asus Zenfone Max

ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారంగా అభివృద్థి చేసిన జెన్ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 1.2 గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో పనిచేసే క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్). ఈ ఫోన్‌లో పొందుపరిచిన 5000 ఎమ్ఏహెచ్ నాన్ -రిమూవబుల్ బ్యాటరీ 914 గంటల వరకు స్టాండ్ బై టైమ్‌ను డెలివరీ చేస్తుందని, టాక్‌ టైమ్ విషయానికొస్తే 38 గంటల వరకు పనిచేస్తుందని ఆసుస్ చెబుతోంది.

 మోటో ఇ3 పవర్

మోటో ఇ3 పవర్

MOTO E3 POWER

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 294 పీపీఐ, ఫోన్ నీటిలో తడవకుండా వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్ , క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, బరస్ట్ మోడ్, హెచ్‌డిఆర్, పానోరమా, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, టాప్ టు ఫోకస్, టాప్ టు క్యాప్చుర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : బ్యూటిఫికేషన్ మోడ్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4G + VoLTEసపోర్ట్, 3జీ, వైఫై, బ్లుటూత్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ lOW రాపిడ్ చార్జ్.

Moto G4 Play

Moto G4 Play

మోటో జీ4 ప్లే

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1280× 720పిక్సల్స్, 294 పీపీఐ), ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో 6.0.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎఫ్/2.2 అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్. స్వల్ప నీటి ప్రమాదాలను తట్టుకునేలా నానో కోటింగ్ పొరతో వస్తోన్న మోటో జీ4 ప్లే ఫోన్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను ఈ డివైస్‌లో పొందుపరిచారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Top 10 Smartphones under Rs 10,000 in India (2016). Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X