భారత్ కంపెనీలకు తలనొప్పిగా చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు

Posted By:

భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్‌ఫోన్‌లు ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతోంది. మార్కెట్లోకి ఒక్కొక్కటికి అడుగుపెడుతున్న చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు దేశవాళీ బ్రాండ్‌లకు తలనొప్పిగా మారాయి. యాపిల్, సామ్‌సంగ్ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లకు ధీటుగా చైనా కంపెనీలు స్మార్ట్‌‍ఫోన్‌లు ఉండటం, అదే సమయంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో వీటిని విక్రయించటం వంటి అంశాలు చైనా స్మార్ట్‌ఫోన్‌ల ప్రాముఖ్యతను మరింతగా పెంచుతున్నాయి. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దేశవాళీ బ్రాండ్‌లకు తలనొప్పిగా మారిన 4 చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Oppo

భారత్‌లో నాలుగు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల హవా!!

Oppo

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఓపో ఇండియన్ మార్కెట్లో తన ఆథిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి 2014లో విడుదలైన ఓపో ఫైండ్ 7 ఆసక్తికర ఫీచర్లతో ఇండియన్ యాజర్లను ఆకట్టుకుంటోంది.

 

Xiaomi

భారత్‌లో నాలుగు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల హవా!!

Xiaomi

చైనా మార్కెట్లో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీగా అవతరించిన జియోమీని 2010లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఆరవస్థానంలో ఉంది. బీజింగ్ కేంద్రంగా కార్యకలపాలు సాగించే జియోమీ అనతికాలంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. తాజాగా భారత్‌లో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఒక టాబ్లెట్ పీసీని జియోమీ ఆవిష్కరించింది.

 

Gionee

భారత్‌లో నాలుగు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల హవా!!

Gionee

జియోనీ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను సెప్టంబర్ 2002లో ప్రారంభించారు. ప్రపంచపు పది అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల జాబితాలో జియోనీ స్థానాన్ని సంపాదించుకుంది. ఇండియన్ మార్కెట్లో జియోనీ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది.

 

Coolpad

భారత్‌లో నాలుగు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల హవా!!

Coolpad

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ కూల్‌ప్యాడ్, అక్కడి మార్కెట్లో యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లను అధిగమించి తిరుగులేని హవాను కొనసాగిస్తోంది. ఈ బ్రాండ్ త్వరలో ఇండియన్ మార్కెట్లోకి ప్రశేశించబోతోంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Top 4 Chinese Smartphone Manufacturers That Could Spell Problem for Indian 
 Handset Makers. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting