ధర రూ.20,000 లలో మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ! లిస్ట్ చూడండి.

By Maheswara
|

భారతదేశంలో 5G సేవను ప్రవేశపెట్టినప్పటి నుండి, చాలా మంది 5G ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా చాలా సెల్ ఫోన్ కంపెనీలు బడ్జెట్ ధరలకు 5G ఫోన్లను విక్రయించడం ప్రారంభించాయి.

 

 రూ.20,000లోపు  

అలాగే, 4G ఫోన్‌ల కంటే 5G ఫోన్‌లకు భారతదేశంలో మంచి ఆదరణ లభిస్తుందని అంచనా ఉంది. అయితే, ఇప్పుడు విషయానికి వద్దాం. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.20,000లోపు  అందుబాటులో బెస్ట్ ఉన్న 5జీ ఫోన్‌ల జాబితాను చూద్దాం.

Redmi Note 11 Pro Plus 5G

Redmi Note 11 Pro Plus 5G

Redmi Note 11 Pro 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో అమెజాన్‌లో ధర రూ.21,999. కి అందుబాటులో ఉంది.అయితే మీరు ఎంచుకున్న బ్యాంకు కార్డులను ఉపయోగించి మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా, ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, ఈ రెడ్‌మీ ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సహా అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

Redmi Note 11 Pro ప్లస్ 5G ఫీచర్లు
 

Redmi Note 11 Pro ప్లస్ 5G ఫీచర్లు

Redmi Note 11 Pro Plus 5Gలో Qualcomm Snapdragon 695 5G చిప్‌సెట్, 5000 mAh బ్యాటరీ సహా అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108MP ప్రధాన కెమెరా + 8MP అల్ట్రా వైడ్ లెన్స్ + 2MP మాక్రో లెన్స్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఇక ఈ Redmi phoneలో 16MP సెల్ఫీ కెమెరా, 67 Watts ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

OnePlus Nord CE 2 Lite 5G

OnePlus Nord CE 2 Lite 5G

OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ 6GB RAM మరియు 128GB నిల్వతో అమెజాన్‌లో రూ.18,999కి అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ లో 64MP రేర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 6.59-అంగుళాల డిస్ప్లే, Qualcomm Snapdragon 695 5G చిప్ సెట్, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

 

Samsung Galaxy M33 5G

Samsung Galaxy M33 5G

Samsung Galaxy M33 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో అమెజాన్‌లో ధర రూ.16,999.కి అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ 5G ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వచ్చింది. అలాగే, ఈ Samsung స్మార్ట్‌ఫోన్‌లో 50MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 6000 mAh, ఆక్టో-కోర్ Exynos 1280 చిప్‌సెట్ సహా క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో సహా అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

Samsung Galaxy F23 5G

Samsung Galaxy F23 5G

6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో Galaxy F23 5G ఫోన్ అమెజాన్‌లో రూ.16,490.కి అందుబాటులో ఉంది. అయితే మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు మరింత తక్కువ ధరకే లభిస్తుంది.

Samsung Galaxy F23 5G స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ లో 2408 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఎన్నో గొప్ప ఫీచర్లు ఉన్నాయి.ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ కెమెరా + 2MP డెప్త్ లెన్స్ యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా సపోర్ట్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ శాంసంగ్ ఫోన్ 8MP సెల్ఫీ కెమెరా సపోర్ట్‌తో వచ్చింది. Samsung ఫోన్ Qualcomm Snapdragon 750 చిప్‌సెట్, 8MP సెల్ఫీ కెమెరా సపోర్ట్‌తో వస్తుంది.

Realme 9 Pro 5G

Realme 9 Pro 5G

6GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో Realme 9 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ Realme 9 Pro 5Gలో 6.6-అంగుళాల డిస్‌ప్లే, 64MP వెనుక కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, Qualcomm Snapdragon 695 చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Top 5 Best 5G Smartphones You Can Buy Under Rs.20000 In India In September 2022. List Is Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X