యూత్‌ను రెచ్చగొడుతున్న టాప్-5!!

Posted By: Prashanth

యూత్‌ను రెచ్చగొడుతున్న టాప్-5!!

 

ఇది నిజం తక్కువ ధర కలిగిన సాధారణ మొబైల్స్‌లో సైతం హై క్వాలిటీ ఎంపీత్రీ ప్లేయర్... మన్నికైన ఎఫ్ఎమ్ రేడియో.. వేగవంతంగా స్పందించే WAP మరియు జీపీఆర్ఎస్ అప్లికేషన్‌లు. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..?, కాలానుగుణంగా వ్యాపార ద్ళక్పధంలో మార్పులు అనివార్యమవటంతో ఇది సాధ్యమైంది.

ప్రస్తుత తరాన్ని స్బార్ట్‌ఫోన్‌లు శాసిస్తున్న నేపధ్యంలో పలు సాధారణ ఫీచర్ ఫోన్‌లు వాటి దూకుడికి అడ్డుకట్ట వేస్తున్నాయి. వాటిలో రూ.1400 మొదలుకుని 6,500 ధరల మధ్య ఉన్న టాప్ 5 వివరాలను మీకు అందిస్తున్నాం.

నోకియా 101:

ఈ డ్యూయల్ సిమ్‌ఫోన్‌లో హై క్వాలిటీ ఎఫ్ఎమ్ రేడియో మరియు ఎంపీత్రీ ప్లేయర్ వ్యవస్ధలను నిక్షిప్తం చేశారు. మెమెరీని 8జీబి వరకు పొడిగించుకోవచ్చు. ధర.1445.

శామ్‌సంగ్ హిరో మ్యూజిక్:

ఈ ఫోన్‌లో అనేక ఉపయుక్తమైన మ్యూజిక్ ఫీచర్లను నిక్షిప్తం చేశారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్, పొందుపరిచిన 1000 mAh బ్యాటరీ 10గంటల సుదీర్ఘ టాక్‌టైమ్ నిస్తుంది. కెమెరా లేదు. మెమరీని 4జీబి వరకు పొడిగించుకోవచ్చు. బ్లూటూత్ అదే విధంగా వై-ఫై కనెక్టువిటి. ధర రూ.1600.

మైక్రోమ్యాక్స్ ఎమ్2

ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ హై క్వాలిటీ సౌండ్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2 మెగా పిక్సల్ కెమెరా హై క్వాలిటి రిసల్యూషన్ కలిగి ఉంటుంది. జీపీఆర్ఎస్ వ్యవస్థ ఇంటర్నెట్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ధర రూ.2165.

సోనీ ఎరెక్సన్‌మిక్స్ వాక్‌మెన్

ఈ వాక్‌మెన్ సిరీస్ ఫోన్ అత్యాధునిక ఆడియో వ్యవస్థను కలిగి ఉంటుంది. 3 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 3.2 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా, వై-ఫై మరియు బ్లూటూత్ కనెక్టువిటీ. ధర రూ.6,500.

ఎల్‌జీ జీఎస్ 155

ఈ ఫీచర్ ఫోన్ ప్రత్యర్ధి బ్రాండ్ల గుండెల్లో దడపుట్టిస్తుంది. పటిష్గమైన ఫీచర్లను ఈ హ్యాండ్‌సెట్‌లో లోడ్ చేశారు. మన్నికైన ఎంపీత్రీ ప్లేయర్, క్వాలిటీ ఎఫ్ఎమ్ రేడియో, బ్యాటరీ టాక్ టైమ్ 15 గంటలు. ధర 1400.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot