ఆషా 206లో.. ఐదు విశిష్టతలు!
డ్యూయల్ సిమ్: ఆషా 206 సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. నిక్షిప్తం చేసిన ఈజీ స్వాప్ టెక్నాలజీ సౌలభ్యతతో సిమ్‌కార్డ్‌లను పవర్ ఆఫ్ చేయకుండానే మార్చుకోవచ్చు.
స్టాండ్‌బై టైమ్: ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పరిశీలిస్తే..... సింగిల్ సిమ్ వేరియంట్ - 47 రోజుల స్టాండ్‌బై, 20 గంటల టాక్‌టైమ్, డ్యూయల్ సిమ్ వేరియంట్ -25 రోజుల స్టాండ్‌బై, 20 గంటల టాక్‌టైమ్.
కలర్: ఆషా 206 బ్లాక్, వైట్, సియాన్, మెజింతా, ఎల్లో వంటి ఆకర్షణీయ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్ వ్యవస్థ ఆకట్టుకుంటుంది.
స్లామ్ : ఆషా 206లో పొందుపరిచిన బ్లూటూత్ తరహా స్లామ్ ఫీచర్ వీడియోలతో పాటు ఫోటోలను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. 2.4 అంగుళాల క్వాగా టీఎఫ్టీ డిస్‌ప్లే, ఎక్ప్‌ప్రెస్ బ్రౌజర్, సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం, 1.3 మెగా పిక్సల్ కెమెరా వంటి ఫీచర్లు ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ తరహా అనుభూతులను చేరువ చేస్తాయి.
ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ: ఆషా 206 స్టోరేజ్ అంశాలను పరిశీలిస్తే 10ఎంబి ఆన్-బోర్డ్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.


Click it and Unblock the Notifications









