రూ.7,000 ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

|

దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలంటే మరికొంత సమయం పడుతుంది. ఈ నేపధ్యంలో 3జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ పెరింది. 2జీనెట్‌వర్క్‌తో పోలిస్తే 3జీ నెట్‌వర్క్ వేగవంతంగా స్పందిస్తుంది. ఈ నెట్‍‌వర్క్ సాయంతో బ్రౌజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్, డౌన్‌లోడింగ్ తదితర ఆన్‌లైన్ అంశాలు చకచక జరిగిపోతాయి. మార్కెట్లో రూ.7000 ధర శ్రేణుల్లో లభ్యమవుతున్న డ్యూయల్ సిమ్ 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో పొందుపరచటం జరిగింది.

మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ గుండెకాయ అయితే, చార్జర్ ఆక్సిజన్ లాంటిది. ఈ రెండింటిలో ఏది సరిగా స్పందించకున్నా.. ఫోన్ మనుగడ కష్టతరమవుతోంది. అయితే, కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడటంతో బ్యాటరీ జీవిత కాలం రెట్టింపవుతుంది. ఇవిగోండి చిట్కాలు.. మీ స్మార్ట్‌ఫోన్ కోసం బ్యాటరీ బ్యాకప్ చిట్కాలు.

సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది. బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం. బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి. అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి. స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో ఎస్7262

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో ఎస్7262

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో ఎస్7262

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ టీఎఫ్టీ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ఏ5 ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 4.0, ఎడ్జ్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ధర రూ.6,289
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఐబాల్ ఆండీ 4డీఐ ప్లస్

ఐబాల్ ఆండీ 4డీఐ ప్లస్

ఐబాల్ ఆండీ 4డీఐ ప్లస్:

4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, యూఎస్బీ, జీపీఆర్ఎస్, జీపీఎస్, 3జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ కనెక్టువిటీ,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6390.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జోలో ఏ500ఎస్ ఐపీఎస్

జోలో ఏ500ఎస్ ఐపీఎస్

జోలో ఏ500ఎస్ ఐపీఎస్:

4 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, డిజిటల్ జూమ్),
ఏ-జీపీఎస్ కనెక్టువిటీ.
ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీ3 ప్లేయర్, వీడియో ప్లేయర్,
3జీ, బ్లూటూత్ వీ3.0, వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ కోర్ 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.7249,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జోలో ఏ500 ఎల్

జోలో ఏ500 ఎల్

జోలో ఏ500 ఎల్:

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6572 ప్రాసెసర్,
మాలీ 400ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకనే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇంటెక్స్ క్లౌడ్ వై4

ఇంటెక్స్ క్లౌడ్ వై4

ఇంటెక్స్ క్లౌడ్ వై4:

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్, 3జీ కనెక్టువిటీ,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X