మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

|

నేటితరం యువత స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో స్మార్ట్ ఫీచర్లు తప్పనిసరి కావటంతో డిమాండ్ అధికంగా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం మీ వెతుకులాట ప్రారంభమైందా..? మార్కెట్లో అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు కొలువుతీరి ఉన్నాయి. వాటిలో మీ ఉత్తమ ఎంపిక ఏది..? నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షర్ చేసుకుంటున్నాం..


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Core 2

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ 2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు). ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను  పరిశీలించినట్లయితే (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్ ఇంకా వైట్ కలర్  వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఫోన్ ధర రూ 11,900

 

మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto E

మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్

డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది.

ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది. ఫోన్ ధర రూ.6,999.

 

మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Star Advance

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ అడ్వాన్స్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే....4.3 అంగుళాల WVGA టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 512ఎంబి ర్యామ్, 3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి  వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ సపోర్ట్, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్ ధర రూ. 7,299

 

మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Panasonic T41

4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), డ్యూయల్ సిమ్ సపోర్ట్, 1650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, జీపీఎస్, 3జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, ఎఫ్ఎమ్ రేడియో.

ఫోన్ ధర రూ.7,999.

 

మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

మీ బడ్జెట్ పరిధిలో 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లు

Lava Iris X1

లావా ఐరిస్ ఎక్స్1 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, వీడియో కోర్ మల్టీమీడియా టెక్నాలజీ ఆధారంగా రూపకల్పన చేయబడిన ప్రత్యేకమైన గ్రాఫిక్ ఇంజిన్ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు, 8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ప్రత్యేకమైన బీఎస్ఐ+ సెన్సార్, ఆటోఫోకస్, టచ్ టూ ఫోకస్, హెచ్‌డిఆర్ మోడ్). ఈ కెమెరా ద్వారా 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు) 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్(క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ కాలింగ్ తో), 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ, ఎడ్జ్,1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X