లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. మైక్రోమ్యాక్స్ కార్బన్, ఇంటెక్స్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు సమంజసమైన ధరల్లో లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే వారు ముఖ్యంగా ర్యామ్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ 512ఎంబి కెపాసిటీతో కూడిన ర్యామ్‌ను కలిగి ఉన్నట్లయితే వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను మీరు ఆస్వాదించవచ్చు. పటిష్టమైన ర్యామ్ (512 ఎంబి) వ్యవస్థను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమాక్స్ యూనిటీ 2
డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4.7 అంగుళాల బ్రైట్ గ్రాఫ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్) క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్), 1జీబి ర్యామ్. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.6,999

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఐబాల్ ఆండీ4 ఐపీఎస్ టైగర్
4 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్480 x 800పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్)
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభయత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్,జీపీఎస్),
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,299

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
iBall Andi4 IPS Velvet
4 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, ఏ2డీపీ,
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
iBall Andi4 IPS GEM
4 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ సిమ్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4,999

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
Motorola Moto E
మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది. ఇండియన్ మార్కెట్లో మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. ధర రూ.6,999.


Click it and Unblock the Notifications








