బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ (త్వరలో ఇండియాకు)

Posted By:

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఎంపిక ఆషామాషీ కాదు. వందల కొలది మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏది మంచిదో తెలుసుకోవటానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌‍లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ అవగాహనకు రండి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. మరో వైపు యాపిల్ ఐవోఎస్,బ్లాక్‍‌బెర్రీ 10 ఇంకా విండోస్ 8 ఓఎస్ ఆధారిత డివైజ్‌లు లభ్యమవుతున్నాయి. వివిధ స్ర్కీన్ వేరియంట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పొడవు 4 అంగుళాల ఉన్నట్లయితే ఇంటర్నెట్ సర్ఫింగ్ ఇంకా స్ర్కీన్ రిసల్యూషన్ బాగుంటుంది. కంపెనీ బట్టి స్మార్ట్‌ఫోన్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫోన్ ఎంపిక సంబంధించి ముందుగానే బ్రాండ్ ఎంచుకోండి. మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా త్వరలో ఇండియన్ మార్కెట్ కు పరిచయం కాబోతున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను గిజ్ బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హువావీ ఆసెండ్ పీ2 (Huawei Ascend P2)

హువావీ ఆసెండ్ పీ2 (Huawei Ascend P2):

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.5 గిగాహెట్జ్ సీపీయూ,
హువావీ కె3వీ2 చిప్‌సెట్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
లియోన్ 2420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ వన్ మినీ

హెచ్‌టీసీ వన్ మినీ:

4.3 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, ఎస్-ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 400 ప్రాసెసర్,
హెచ్‌టీసీ 4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ కెమెరా,
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సోనీ ఎక్స్‌పీరియా టీఎక్స్ (Sony Xperia TX)

సోనీ ఎక్స్‌పీరియా టీఎక్స్ (Sony Xperia TX):

4.6 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1280× 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ కెమెరా (సోనీ ఎక్స్‌మార్ ఆర్ సెన్సార్, ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ వీడియో కాలింగ్ కెమెరా,
1జీబి ర్యామ్,
లియోన్ 1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మువావీ ఆసెండ్ పీ6 (Huawei Ascend P6)

మువావీ ఆసెండ్ పీ6 (Huawei Ascend P6):

4.7 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
8 మెగా పిక్సల్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఆన్-బోర్డ్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్,
లైపో 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఎల్టీఈ ఆడ్వాన్సుడ్ (Samsung Galaxy S4 LTE Advanced)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఎల్టీఈ ఆడ్వాన్సుడ్ (Samsung Galaxy S4 LTE Advanced):

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్),
2.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, జీరో షట్టర్ లాగ్, బీఎస్ఐ, హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యత),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫోన్ మందం 7.9 మిల్లీమీటర్లు, బరువు 131 గ్రాములు,
2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot