ఆ లెనోవో ఫోన్‌లో అంత దమ్ముందా..?
ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ లెనోవో, Vibe K5 Plus పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.8,499. ఫోన్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఓమ్నీవిజన్ OV13850 సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్, 5 పిక్సల్ లెన్స్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 4జీ, 3జీ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. డాల్బీ అటామస్ ఫీచర్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో 2,750 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీని ఏర్పాటు చేసారు. లెనోవో వైబ్ కే5 ప్లస్ బెస్ట్ అనటానికి 5 కారణాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..
Read More : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు చక్కుల చూపించిన కిలాడీ దొంగలు

లెనోవో వైబ్ కే5 ప్లస్ బెస్ట్ అనటానికి 5 కారణాలు
లెనోవో వైబ్ కే5 ప్లస్, 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1920x1080పిక్సల్స్, 441 పీపీఐ పిక్స్ డెన్సిటీ. టచ్ రెసిస్టెంట్ గ్లాస్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ.

లెనోవో వైబ్ కే5 ప్లస్ బెస్ట్ అనటానికి 5 కారణాలు
లెనోవో వైబ్ కే5 ప్లస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కమెరాతో వస్తోంది. ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పికల్ కెమెరా ద్వారా క్వాలిటీ సెల్పీలతో పాటు వీడియో కాలింగ్ ను ఆస్వాదించవచ్చ.

లెనోవో వైబ్ కే5 ప్లస్ బెస్ట్ అనటానికి 5 కారణాలు
లెనోవో వైబ్ కే5 ప్లస్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

లెనోవో వైబ్ కే5 ప్లస్ బెస్ట్ అనటానికి 5 కారణాలు
లెనోవో వైబ్ కే5 ప్లస్, 2,750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పై రన్ అవుతుంది. ఫుల్ డే బ్యాకప్‌ను యూజర్లు ఆస్వాదించవచ్చు.

లెనోవో వైబ్ కే5 ప్లస్ బెస్ట్ అనటానికి 5 కారణాలు
లెనోవో వైబ్ కే5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన డ్యుయల్ స్పీకర్ వ్యవస్థ డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్ సిస్టంను సపోర్ట్ చేస్తుంది. Theatremax అనుభూతులను ఈ ఫోన్ ద్వారా ఆస్వాదించవచ్చు.


Click it and Unblock the Notifications








