కొత్త ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి 5 బెస్ట్ ఆప్షన్స్

భారత్‌లో పండుగుల సీజన్ ఊపందుకున్న నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజాలు బెస్ట్ ఆఫర్లతో ఆన్‌లైన్ షాపర్లను ఆక్టట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

కొత్త ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి 5 బెస్ట్ ఆప్షన్స్

Read More : ఆ వస్తువులపై ఏకంగా 70 శాతం తగ్గింపు

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో అమెజాన్, బిగ్ బిలియన్ డేస్ సేల్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్, అన్‌బాక్స్ దివాళీ సేల్ పేరుతో స్నాప్‌డీల్‌లు తమ ఫెస్టివల్ సేల్‌ను లాంఛనంగా ప్రారంభించాయి. ఈ పండుగ ఊపులో కొత్త ఫోన్‌ను కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకోసం 5 బెస్ట్ ఆప్షన్స్ ఎదురుచూస్తున్నాయి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వన్‌ప్లస్ 2 (One Plus 2)

వన్‌ప్లస్ 2 (One Plus 2)
తాజాగా ఈ ఫోన్ పై రూ.3,000 తగ్గించారు,
అమెజాన్ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను ప్రత్యేక డిస్కౌంట్ పై రూ.19,999 ధర ట్యాగ్ తో విక్రయిస్తున్నారు. ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి...

5.5 అంగుళాల 1080 పిక్సల్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం.

 

మోటో జీ4 ప్లస్ (Moto G4 Plus)

మోటో జీ4 ప్లస్ (Moto G4 Plus)
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.14,999
తాజాగా ఈ ఫోన్ పై రూ.1500 తగ్గించారు,
అమెజాన్ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను ప్రత్యేక డిస్కౌంట్ పై రూ.13,499 ధర ట్యాగ్‌తో విక్రయిస్తున్నారు. ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి...

5.5 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెెమరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్.

 

Lenovo Vibe K5 Note (4GB RAM)

లెనోవో వైబ్ కే5 నోట్
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.13,499 (4జీబి ర్యామ్ వేరియంట్)
తాజా ఈ ఫోన్ పై రూ.500 తగ్గించారు
ప్రస్తుత ధర రూ.12,999

ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా లెనోవో వైబ్ కే5 నోట్ ఫోన్‌ను ప్రత్యేక డిస్కౌంట్ పై విక్రయించనున్నారు. అక్టోబర్ 3న ఈ ఫోన్‌కు సంబంధించిన డీల్ అందుబాటులో ఉండే అవకాశం. 

ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి...

లెనోవో వైబ్ కే5 నోట్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, 450 nits బ్రైట్నెస్, 1000:1 కాంట్రాస్ట్ రేషియో వంటి ఫీచర్లను ఈ డిస్‌ప్లేలో పొందుపరిచారు. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. సెక్యూర్ జోన్ పేరుతో ఈ డివైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫీచర్ ఫోన్‌లోని సమాచారాన్ని భద్రంగా దాస్తుంది. రెండు వేరు వేరు వాట్సాప్ అకౌంట్‌లను ఈ ఫోన్‌లో నిర్వహించుకునేు అవకాశం కల్పించారు. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, పీడీఏఎఫ్, f/2.2 aperture వంటి ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంగా ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్పీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్. లెనోవో వైబ్ కే5 నోట్ స్మార్ట్‌ఫోన్‌‍‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసారు. 0.3 సెకన్ల వ్యవధిలో ఈ సెన్సార్, ఫోన్‌ను అన్‌లాక్ చేయగలదు. థియేటర్ మాక్స్ టెక్నాలజీ ఫోన్ సౌండ్ క్వాలిటీని రెట్టింపు చేస్తుంది.

 

LeEco Le 2

లీఇకో లీ2
విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.11,999
తాజాగా ఈ ఫోన్ పై రూ.1500 తగ్గించారు.
ప్రస్తుత ధర రూ.10,499

ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా లీఇకో లీ2 ఫోన్‌ను స్పెషల్ డిస్కౌంట్ పై విక్రయించనున్నారు. అక్టోబర్ 3న ఈ ఫోన్‌కు సంబంధించిన డీల్ అందుబాటులో ఉంటుంది.

ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి...

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం.

 

ASUS Zenfone 2

ASUS Zenfone 2

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.18,999గా ఉంది.
తాజాగా ఈ ఫోన్ పై రూ.10,000 తగ్గించారు
ప్రస్తుత ధర రూ.9,999
ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ASUS Zenfone 2 ఫోన్‌ను, ఈ స్పెషల్ డిస్కౌంట్ పై విక్రయిస్తున్నారు.

ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఇంటెల్ ఆటమ్ జెడ్3580 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 5 smartphones to buy this festive season. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot